హాట్ టాపిక్: ట్విట్టర్ లో విక్రమ్ పై మండిపడ్డ దగ్గుపాటి రాణా

By Srikanya

హైదరాబాద్: ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏమిటీ అంటే.. జాతీయ స్ధాయి నటుడు విక్రమ్ పై దగ్గుపాటి రాణా మండిపడ్డాడనే. రీసెంట్ గా దగ్గుపాటి రాణా... ట్విట్టర్ లో ఓ రేంజిలో విక్రమ్ పై కోప్పడ్డారు. రాణా ట్వీట్ చేస్తూ.... పది డిసాస్టర్ సినిమాలకు దగ్గరవుతున్న నువ్వు... నీ కెరీర్ పైనే దృష్టి పెట్టడం ఉత్తమం. నటుడుగా నా వయస్సు కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే. కాని ఇరవై ఐదు సంవత్సరాలకు దగ్గరవుతున్నావు. నువ్వు నీ గురించే ఆలోచించుకో..నేను నువ్వు నటించిన కొన్ని చిత్రాలకు పెద్ద ఫ్యాన్ ని అని విమర్శించారు.

దీనికంతటికీ కారణం.. విక్రమ్ రీసెంట్ గా.. ఓ ఇంటర్వూలో... దక్షిణాది నటులు ఎందుకు బాలీవుడ్ లో విజయం సాధించలేకపోతున్నారన్న దానికి సమాధానం చెప్తూ... రాణా దగ్గుపాటిని చూడండి.. తెలుగులో కెరీర్ ప్రారంభించాడు. కానీ దక్షిణాదిన ఏమీ సాధించలేదు. అందుకే అతన్ని తెలుగు ఇండస్ట్రీనే పట్టించుకోవటం లేదు..బాలీవుడ్ లో పని చేయాలంటే... నేను ఇక్కడ అన్నీ వదిలేసుకుని అక్కడికి రావాలి అన్నాడు.

ప్రస్తుతం రాణా.. గుణశేఖర్ చిత్రం రుద్రమదేవిలో నటిస్తున్నారు. అందులో అనుష్క సరసన చేస్తున్నారు. 'రుద్రమదేవి' పేరుతో రూపొందే ఈ చిత్రాన్ని గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రధాన పాత్రలో అనుష్క నటిస్తుంది. వీరభద్రుడి పాత్రను రాణా పోషిస్తున్నారు. కాకతీయుల చారిత్రాత్మక స్థలమైన ఓరుగల్లులో గురువారం లాంఛనంగా ముహూర్తపు కార్యక్రమాల్ని నిర్వహించారు.

ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బహుబలి'లో దగ్గుబాటి యువ హీరో రాణా నెగెటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని తనకు తానుగా అఫీషియల్ గా ప్రకటించుకున్నాడు రాణా. తన ట్విట్టర్ పేజీలో ఈ విషయమై ప్రస్తావిస్తూ...... ప్రభాస్ సోదరుడి పాత్రలో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. 'బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X