విక్రమ్-శంకర్ ‘ఐ’ పూర్తి, పార్టీ చేసుకున్నారు (ఫోటోలు)
చెన్నై: విక్రమ్, అమీ జాక్సన్ జంటగా ప్రముఖ దర్శకుడు శంకర్ తరకెక్కిస్తున్న చిత్రం 'ఐ'. తాజాగా ఈ చిత్రం పనులు పూర్తయి సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకడు శంకర్ చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో వీక్షించండి....
ఐ సినిమా వివరాలు
సినిమాలో పావు వంతు చైనాలో చిత్రీకరణ చేశారు. అక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతల మధ్య చిత్రీకరించారు. హునాన్ ప్రాంతంలో కీలక సన్నివేశాలు, పోరాటాల్ని తెరకెక్కించారు. బ్యాంకాక్, జోధ్‌పూర్, కొడైకెనాల్, పొల్లాచ్చి, చెన్నై వంటి ప్రాంతాల్లో విక్రమ్, ఇతర తారాగణంపై యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించారు.
'అవతార్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్', 'హోబిట్' లాంటి ఇంగ్లిష్ సినిమాలకు డిజిటల్ మేకప్, నేపథ్య కళ విభాగంలో పనిచేసిన వెటా డిజిటల్ సంస్థ ఈ సినిమాకి పని చేస్తోంది. ఆ సంస్థకు చెందిన రిచర్డ్ టేలర్, పీటర్ జాక్షన్ ఇందులో పనిచేస్తున్నారు. విక్రమ్ గెటప్ కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి మేకప్‌మెన్‌లను పిలిపించారు. ఆయన కేశాలంకరణ నుంచి వస్త్రధారణ వరకు అన్నీ వైవిధ్యంగా ఉంటాయట. సీన్‌ఫుట్, డావియానా లామంట్ వేసిన మేకప్ విక్రమ్‌ని ప్రేక్షకులకు కొత్తగా చూపిస్తుందట. ప్రపంచ వ్యాప్తంగా 17 భాషల్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
క్లైమాక్స్ సన్నివేశాల కోసం 30 రోజుల్ని కేటాయించినట్లు సమాచారం. ఈ చిత్రం క్లైమాక్స్ సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా రూపొందించారని చెప్తున్నారు. 2014, ఏప్రిల్ 14న శంకర్ ఐ చిత్రం విడుదలకు సిద్దం అంటూ స్టేట్‌మెంట్ వచ్చేసింది. ఐ మూవీను తెలుగులో మనోహరుడుగా రిలీజ్ అవుతుంది. ఏ.ఆర్.రెహమ్మాన్ సంగీతాన్ని అందించారు.

ఐ అంటే...
తమిళంలో 'ఐ' అంటే అందం, రాజు, గురు, మృదుత్వం అని అర్థాలున్నాయి. తెలుగులో అదే అర్దం వచ్చేలా మనోహరుడు అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

సూపర్బ్ స్టోరీ
డిటెక్టివ్ నవలలతో రచయితలుగా పేరుగాంచిన రచయిత ద్వయం డి.సురేష్‌బాబు, ఎ.ఎన్.బాలకృష్ణ సినిమాకి కథని అందించారు. దాంతో ఈ చిత్రంపై తమిళనాట మంచి క్రేజ్ ఉంది.

హాలీవుడ్ టెక్నీషియన్స్
'మెన్ ఇన్ బ్లాక్' సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మేరీ వోగ్ట్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. సినిమాలో అవి ప్రత్యేక ఆకర్షణ గా నిలవనున్నాయి.

చైనా ఫైటర్స్
చైనాకి చెందిన పీటర్ మింగ్, అనల్ అరసు ఆధ్వర్యంలో భారీ పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. గతంలోనూ శంకర్ చిత్రాల్లో ఫైట్స్ ప్రత్యేకంగా ఉండేవి. ఇప్పుడు అవి మరింత అద్బుతంగా ఉండనున్నాయి.

విజువల్ ట్రీట్
ఆస్ట్రేలియాకి చెందిన రైజింగ్ సన్ పిక్చర్స్ సంస్థ శ్రీనివాస్ ఎం.మోహన్ ఆధ్వర్యంలో విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తోంది. స్టన్నింగ్ విజువల్స్ ఉంటాయని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











