మైండ్ బ్లోయింగ్... అదరకొట్టారు(వీడియో)
చెన్నై: శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన 'ఐ' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ చూసిన వాళ్లు షాక్ అవుతున్నారు. తెలియకుండానే నోటి నుంచి మైండ్ బ్లోయింగ్ అనే పదం వస్తోంది అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరూ చూడండి.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్ నటించాడు'' అన్నారు.

విక్రమ్ మాట్లాడుతూ ''శంకర్ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.


Click it and Unblock the Notifications











