విక్రమ్ 'ఐ' ఫస్ట్‌లుక్‌ విడుదలైంది(వీడియో)

By Srikanya

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఐ'. ఈ చిత్రంఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో విక్రమ్ ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. చాలా విభిన్నంగా విక్రమ్ కనపడటంతో చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతున్నాయనటంలో సందేహం లేదు. మీరూ ఫస్ట్ లుక్ ని చూడండి.

ఇక ఈ చిత్రం ఆడియోను ఈనెల 15న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ హాజరుకానున్నారు. తెలుగులో 'మనోహరుడు' పేరుతో విడుదల చేయనున్న ఈ చిత్రాన్ని ఆస్కార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై వి.రవిచంద్రన్‌ నిర్మిస్తుండగా ఏఆర్‌ రెహమాన్‌ సంగీత మందిస్తున్నారు. అమీజాక్సన్‌ హీరోయిన్.

Vikram's 'I' Motion Poster Released

ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. . ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది. . ప్రముఖ సంగీత దర్శకడు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసారు. పీసీ శ్రీరామ్ కెమెరామేన్. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తారు. శుభతో కలిసి శంకర్ కూడా కథను రాశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రానున్న ఈ సినిమాను అంతే అపురూపంగా నెక్స్ట్ లెవల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారట శంకర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X