విక్రమ్ రాజపట్టయ్ తెలుగులో ‘వీడింతే’

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న వీడింతేలో విక్రమ్ విచిత్రమైన వివిధ గెటప్ లలో కనిపించబోతున్నాడు. 'మర్యాద రామన్న" హీరోయిన్ సలోని ఇందులో ఐటం సాంగులో దర్శనం ఇవ్వబోతుండగా... శ్రియ, రీమా సేన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ ద్శకుడు, నటుడు కె. విశ్వనాథ్ ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పోషించారు.
కమర్సియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సుసీన్తిరన్ దర్శకత్వం వహిస్తుండగా, పవన్ కళ్యాణ్ పంజా సినిమాకు సంగీతం అందించిన యువన్ శంకర్ రాజ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చారు. డిసెంబర్ 16న తెలుగు, తమిళంలో ఒకేసారి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











