కత్తిలాంటి కుర్రాడిని పట్టేసిన శేఖర్ కమ్ముల.. స్టార్ హీరో కొడుకుతో సినిమా!
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఇంతవరకు శేఖర్ కమ్ముల మరో చిత్రం ప్రారంభించలేదు. ఫిదా చిత్రం విడుదలై ఏడాది గడిచిపోతోంది. శేఖర్ కమ్ముల ప్రతిభ తక్కువగా అంచనా వేసేది కాదు. స్టార్ కాస్టింగ్ అవసరం లేకుండానే హిట్ హిట్టగల సత్తా ఆయనకు ఉంది. చాలామంది
చాలా మంది యువ నటులు, నటీమణులు శేఖర్ కమ్ముల చిత్రాలతో స్టార్లుగా మారారు. కాగా తన తదుపరి చిత్రం విషయంలో శేఖర్ కమ్ముల ఎవరూ ఊహించని అడుగు వేయబోతున్నారు. తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ తో శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

విక్రమ్ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వం పట్ల ఆసక్తిగా ఉన్నాడట. తన కుమారుడికి తెలుగులో పర్ఫెక్ట్ లాంచ్ అవుతుందని భావిస్తున్నాడట. ధృవ్ లుక్స్ శేఖర్ కమ్ములని ఎంతగానో ఆకట్టుకునట్లు తెలుస్తోంది. డాన్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ధృవ్ లాంటి తాజాదనం ఉన్న హీరో సరిపోతాడని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాధమిక చర్చలు ముగిసిన అనంతరం దీనిపై అధికారిక ప్రకతాం వచ్చే అవకాశం ఉంది.
ధృవ్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం వర్మలో నటిస్తున్నాడు. బాలా ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ధృవ్ ముందు నుంచే తన లుక్స్ తో దర్శక నిర్మాతలని ఆకర్షిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











