»   »  హీరో విక్రమ్ కుమారుడు డైరెక్టర్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఇదే (వీడియో)

హీరో విక్రమ్ కుమారుడు డైరెక్టర్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఇదే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చియాన్ విక్రమ్ కు టీనేజ్ కొడుకు, కూతురు ఉన్నారంటే నమ్మబుద్ది కాదు. ఈ 50 ఏళ్ల స్టార్ ఇప్పటికీ తన శరీరంతో ప్రయోగాలు చేస్తూ అందరనీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే విక్రమ్ కూతురు అక్షిత వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

Vikram's son Dhruv short film Goodnight Charlie

విక్రమ్‌కు ఇంకా కుమారుడు ధృవ్ ఉన్నాడు. తండ్రి లాగే కుమారుడికి కూడా సినిమాలంటే వ్యామోహం. భవిష్యత్తులో మరి ధృవ్ హీరోగా లేదా దర్శకుడిగా సినిమా రంగంలో రాణిస్తాడనేది తేలిపోయింది.

లండన్‌లోని మెట్ ఫిలిం స్కూల్ లో ధృవ్ చదువుతున్నాడు. తన ప్రాజెక్టులో భాగంగా ధృవ్ తాజాగా ఓ షార్ట్ ఫిలింని తెరకెక్కించాడు. దీనికి స్టోరి కూడా అతనే రాసుకోవడం విశేషం. 'గుడ్‌నైట్ ఛార్లీ' పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిని విక్రమ్ నిర్మించాడు.

ఇటీవలే ఆ షార్ట్ ఫిల్మ్ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. దీనికి మంచి స్పందన వస్తోంది. మీరూ ఓ లుక్కేయండి మరి.

English summary
Vikram's son Dhruv directed short film Goodnight Charlie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu