విక్రమ్ 'వీడింతే'విడుదల తేదీ ఖరారు
విక్రమ్ తాజా చిత్రం 'వీడింతే'(బై బర్త్)ఈ నెల 30న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంలో విక్రమ్ పదిహేడు పాత్రలను పోషిస్తున్నారు. ఓ జిమ్‌బారుకు సినిమా నటుడు కావాలన్న ఆశ ఉంటుంది. దీన్నే కామెడీగా చూపించారు. ఆ క్రమంలో డిఫరెంట్ గెటప్స్ వస్తాయని విక్రమ్ తెలియజేశారు. గతంలో కార్తీతో 'నా పేరు శివ'చిత్రం డైరక్ట్ చేసిన సుశీంద్రన్ ఈ సినిమాని డైరక్ట్ చేసారు. ఈ చిత్రం గురించి విక్రమ్ మాట్లాడుతూ... సుశీంద్రన్ కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. హీరోగా ముగ్గురు హీరోయిన్‌లతో కాసేపు డ్యూయెట్లు పాడుకుందామనుకుంటే విభిన్నమై గెటప్స్ ఇచ్చారు. ఒక్కో గెటప్ స్క్రీన్‌పై ఒక నిముషం కన్పిస్తుంది. కానీ దానికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. విశ్వనాథ్ వంటి సీనియర్ నటుడితో చేయడం ఆనందంగా ఉంది.
ఆయన నాకు గాడఫాదర్‌లా చిత్రంలో గైడ్ చేస్తుంటాడు. పక్కా మాస్ కమర్షియల్ చిత్రమిది' అని అన్నారు. ఇక దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ...'తమిళంలో నాకు నాల్గవ సినిమా. విశ్వనాథ్‌గారు చాలా సిన్సియర్ నటించారు. ప్రతి విషయాన్ని బాగా పరిశీలించారు. విక్రమ్ బాగా నటించాడు' అని అన్నారు. యువన్ మాట్లాడుతూ...'పదేళ్ళగా విక్రమ్ తెలుసు. అయినా తొలిసారిగా ఆయన సినిమాకు పనిచేసే అవకాశం దక్కింది.
పాటలు ఆదరణ పొందుతాయనే నమ్మకముంది' అని అన్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి తెలియజేశారు. ఈ చిత్రంలో విక్రమ్ సరసన దీక్షాసేధ్ చేస్తోంది. అలాగే సలోనీ,రీమా సేన్, శ్రియ స్పెషల్ సాంగ్స్ లో కనపిస్తారు. భూకబ్జాల నేపధ్యంలో చిత్రం నడుస్తుంది.


Click it and Unblock the Notifications











