మహేష్ '1' లో మెయిన్ విలన్ ఇతనే(ఫోటో)
హైదరాబాద్ : మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం '1'. నేనొక్కడినే అన్నది ట్యాగ్ లైన్. కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. సుకుమార్ దర్శకుడు. ఈ చిత్రంలో విలన్ గా విక్రమ్ సింగ్ నటిస్తున్నాడు. హిందీలో మహేష్ భట్ క్యాంప్ లో య-రాబ్ అనే చిత్రం లో హీరోగా చేస్తున్న విక్రమ్ తెలుగులో విలన్ గా బిజీ అవుతానంటున్నాడు.
మహేష్ బాబు గురించి మాట్లాడుతూ... " ఇండియాలో ఉన్న గుడ్ లుకింగ్ ఏక్టర్స్ లో మహేష్ ఒకరు. బాలీవుడ్ కూడా ఇలాంటి వారి మీద ఒక కన్ను వేసి ఉంచుతుంది. కోలా యాడ్ చేసాక ఆయన ఎక్కడికో వెళ్లిపోయారు. కానీ ఆయన పర్శనల్ గా చాలా డౌన్ టు ఎర్త్ మనిషి..అలాంటి వ్యక్తితో పనిచేయటం చాలా గౌరవంగా భావిస్తున్నా ." అన్నాడు.
ఇక '1' చిత్రం ఈ నెల 18 నుంచి లండన్, బెల్‌ఫాస్ట్‌ల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ ఏకబిగిన రెండు నెలలపాటు చిత్రీకరణ చేస్తారు. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర .
అనిల్ సుంకర మాట్లాడుతూ ''ఇటీవల విడుదల చేసిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఒక్క రోజులోనే పది లక్షల మంది ఆ టీజర్‌ని వీక్షించారు. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది''అన్నారు. మరో ప్రక్క టీజర్ వచ్చిన స్పందన పట్ల మహేష్‌బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications











