twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ 'శివ తాండవం' కథ ఏంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్ : విక్రమ్‌, జగపతిబాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్‌ దర్శ కత్వంలో సి.కళ్యాణ్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. ఈ చిత్రం అక్టోబర్ 5 న విడదల అవుతున్న ఈ చిత్రంలో విక్రమ్ ఓ ఢిఫరెంట్ పాత్రలో రా ఆఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే ఈ పాత్రకు ఉన్న మరో ప్రత్యేకత అంధుడిగా విక్రమ్ కనిపించటం. ఇక ఈ చిత్రం మరో ప్రత్యేకత ఏమిటీ అంటే..అనూష్క. ఆమె చిత్రం ప్లాష్ బ్యాక్ లో కనపడనుందని తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్ గా చేస్తున్న అమీ జాక్సన్ పాత్ర హైలెట్ కానుంది.

    ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే... లండన్‌లోని బహుళ అంతస్థుల భవనం అది. అక్కడికి రోజూ వేలమంది వస్తుంటారు. వెళ్తుంటారు. ఓ రాత్రి ఆ భవనం పైనుంచి పడి ఓ యువకుడు మరణిస్తాడు. అది హత్య, ఆత్మహత్య అనేది అక్కడి భద్రతా సిబ్బందికి అర్థం కాదు. సీసీ కెమెరాలను చూస్తే ఓ ఆధారం దొరికింది. ఆ మరణం వెనుక ఎవరున్నారో అర్థమైంది. ఇంతకీ ఈ రహస్యాన్ని ఎలా ఛేదించారు? ఈ కుట్ర వెనుక ఎవరు దాగున్నారు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'శివతాండవం' సినిమా చూడాలి.

    చిత్రం కథ ఈ రెండు దేశాల్లో సాగుతుంది. ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి దర్శకుడు ఎ.ఎల్ విజయ్ మాట్లాడుతూ..'అసాధారణ శక్తులున్న ఓ అంధుడి జీవిత కథే 'శివతాండవం. కాలగమనంలో కఠిన పరీక్షల్ని అతను ఎలా ఎదుర్కొన్నాడన్నదే చిత్ర ఇతివృత్తం. అతనిలో వున్న ఓ అసాధారణ శక్తి ఏమిటనేది సినిమాలో ఆసక్తికరమైన పాయింట్' అన్నారు. నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''ప్రాణ వ్రపదంగా పెరిగిన ఇద్దరు మిత్రుల కథ ఇది. ఈ చిత్రంలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాలో విక్రమ్‌ అంధుడిగా నటించేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నారు'' అన్నారు. అమీ జాక్సన్ కి సంభందించిన సీన్స్ మొత్తం యు.ఎస్ లో చిత్రీకరించారు. అనూష్క ఎపిసోడ్ మొత్తం ఇండియాలో సాగుతుంది.

    అత్యున్నత ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు . జి.విపకాష్‌కుమార్ సంగీతాన్నందిస్తున్నాడు. షాయాజీ షిండే, నాజర్, కోట శ్రీనివాసరావు, శంతనమ్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. విక్రమ్‌కి సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క, యామీ జాక్సన్‌, లక్ష్మీరాయ్‌, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్‌, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్‌, ఢిల్లి గణేష్‌ ముఖ్య పాత్రధారులు.

    English summary
    Vikram-starrer Shiva Thandavam (Thaandavam in Tamil) will be released on October 5. The film has Jagapathi Babu playing a role with negative shades. Vikram will play the role of a blind man, who practices the technique of human echolocation - a rare phenomenon in human beings with an ability to detect objects, their position and size by sensing echoes. The movie surely promises a good dosage of high voltage action scenes, romance and even comedy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X