మంచుకురిసే వేలలో విక్రమ్-కలర్స్ స్వాతి!
మంచు కురుస్తూ ఉంటే నాయకానాయికలు ఆడుతూ పాడుతూ ప్రేమించుకోవడం సినిమాల్లో సాధారణమే. నిజం మంచులో ఆడి పాడటం అంత సులువు కాదు. అసలు చిత్రీకరణే ఎంతో కష్టం. విక్రమ్, స్వాతి జంటగా ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోంది. కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. '7/జి బృందావన కాలని" శ్రీరాఘవ దర్శకుడు. కాశ్మీర్ లోని లఢక్, లేహ్ ప్రాంతాల్లో చిత్రీకరణ ప్రారంభించారు. శీతాకాలం కావడంతో అక్కడ మంచు విపరీతంగా కురుస్తోంది. అయినా నటీ నటులు, సాంకేతిక నిఫుణులు చిత్రీకరణలో పాల్గొన్నారు. అయితే చలి పెరిగిపోవడం, గాలులు ఎక్కువ కావడంతో చిత్రీకరణకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోకి వచ్చేయడంతో షూటింగ్ ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిసింది.
More from Filmibeat
విక్రమ్ స్వాతి శీతాకాలం మల్లన్న అపరిచితుడు అష్టాచమ్మా vikram swathi unfavourable weather mallanna aparichithudu asta chemma


Click it and Unblock the Notifications











