SSMB28: మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో తమిళ స్టార్ హీరో.. అసలు క్లారిటీ వచ్చేసింది
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. SSMB28 గా సెట్స్ పైకి వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు దాదాపు ఆ సినిమా పనులన్నింటినీ కూడా పూర్తి చేసే దశకు చేరుకున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని అది కూడా నెగిటివ్ షేడ్స్ లో కనిపించనున్నట్లు చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. ఆ విషయంపై ఫైనల్ గా ఆ హీరో కి సంబంధించిన మేనేజర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

మిస్ చేసుకోవద్దు అని..
అతడు, ఖలేజా సినిమా అనంతరం దాదాపు 15 ఏళ్ల తర్వాత మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. గత ఆరేళ్ళ క్రితమే దర్శకుడు ఈ స్టార్ హీరో ని లైన్లో పెట్టాలని అనుకున్నాడు. కానీ అప్పుడు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్ బాబును మిస్ చేసుకోకూడదు అని త్రివిక్రమ్ ప్రాజెక్టును లాంచ్ అయితే చేసేసాడు.

విడుదల హడావుడిలో బిజీగా..
ఏప్రిల్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్ విడుదల హడావుడిలో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక నెక్స్ట్ మహేష్ బాబు సినిమాతో బిజీ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ప్రణాళికలు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఇక నటీనటులు ఎవరు అనే విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ కోసం త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నాడు.

మహేష్ సినిమా కోసం విక్రమ్
అయితే ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం త్రివిక్రమ్ తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోను సంప్రదించారని అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఆ హీరో మరెవరో కాదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో విక్రమ్ అని టాక్ వచ్చింది. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో కూడా ముఖ్యమైన పాత్ర కోసం ఇతర హీరోలను సెలెక్ట్ చేసుకుంటాడు. అదే తరహాలో మహేష్ సినిమా కోసం కూడా విక్రమ్ ను ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది.

అబద్ధమే..
ఇక ఫైనల్ గా విక్రమ్ మేనేజర్ సోషల్ మీడియా ద్వారా ఒక క్లారిటీ ఇచ్చేశాడు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు ఒకసారి క్లారిటీగా తెలుసుకుంటే మంచిది అని కూడా వారు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. దీంతో మహేష్ విక్రమ్ కలయిక అనేది అబద్ధమే అని క్లారిటీ వచ్చేసింది.

వీలైనంత త్వరగా ఫినిష్ చేసి..
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ ప్రత్యేకంగా ఫిట్నెస్ లో మాత్రమే కాకుండా లుక్ విషయంలో కూడా మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











