హీరో విక్రమ్ భూ కబ్జాలు...
హీరో విక్రమ్ తమిళంలో నటిస్తున్న 'రాజపట్టె" సినిమా తెలుగులో 'వీడింతే" పేరుతో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రం గురించి హీరో విక్రమ్ మాట్లాడుతూ....'నేను మొదటి నుంచి విభిన్న కథా చిత్రాలకే ప్రాధాన్యతనిస్తాను. ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటూనే చాలా రియలిస్టిక్‌గా వుంటుంది. ఇందులో నేను బాడీబిల్డర్ పాత్రను పోషిస్తున్నాను. భూకబ్జాల నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది అన్నారు. కె విశ్వనాథ్ గారితో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది అన్నారు.
ఈ సినిమాలో దీక్షాసేథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రియ, రీమాసేన్, సలోని ఐటమ్ సాంగ్‌లో నర్తిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా. పి.వి.పి. సినిమా పతాకంపై సుశీంవూదన్ దర్శకత్వంతో ప్రసాద్.వి.పోట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో 'భీమిలీ కబడ్డీ జట్టు" 'నా పేరు శివ"లాంటి చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడు సుశీంవూదన్ ఈ చిత్రాన్ని యాక్షన్ ప్రధానంగా అద్భుతంగా తీర్చిదిద్దాడని అంటున్నారు. సురేష్ బాబు తెలుగులో తమ బ్యానర్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











