దీక్షా సేథ్ చెప్పులు మోసిన హీరో
హీరోయిన్ దీక్షాసేథ్ తమిళంలో తొలిసారిగా 'రాజపట్టయ్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగులో 'వీడింతే' పేరుతో ఈ నెలాఖరున విడుదల కానుంది. గతంలో కార్తీతో 'నా పేరు శివ'చిత్రం డైరక్ట్ చేసిన సుశీంద్రన్ ఈ సినిమాని డైరక్ట్ చేసారు. ఈ సినిమా గురించి దీక్షసేథ్ మాట్లాడుతూ...గతంలో వచ్చిన చిత్రాల కంటే ఈ సినిమా విభిన్నంగా ఉంటుందని తెలిపారు. విక్రమ్ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత కొంత ఉద్వేగానికి గురయ్యా, కానీ ఆయనతో పని చేయడం చాలా ఈజీ అనిపించింది. ఆయన ఫ్రెండ్లీ నేచర్ నచ్చింది అని చెప్పింది.
ఇటలీలో షూటింగ్ జరిగినప్పుడు మంచులో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను. చెప్పులు కూడా వేసుకోలేదు. సీన్ అయిపోగానే పరుగెత్తుకుంటూ వెళ్లి కుర్చీలో కూర్చున్నా. నా అవస్థ చూడలేక విక్రమం నా చెప్పులు చేత్తో పట్టుకుని వచ్చారు. అంత పెద్ద స్టార్ ఆ పని చేయడంతో నా నోట మాటరాలేదు. ఆయన ఇంత స్నేహంగా ఉంటారని అప్పుడే తెలిసింది. ఆయన చాలా మంచి వ్యక్తి. తమిళంలో తొలి సినిమా ఆయనతో చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











