Vikrant Rona First Review: కేజేఎఫ్ 2కి తగ్గకుండా మూవీ.. ఒక్కసారిగా అమాంతం అంచనాలు పెంచేశారుగా!
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగులోనూ ఫేమస్. ఈగ సినిమాతో విలన్‌గా పరిచయమైన సుదీప్ ఆ తరువాత పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ మధ్య సుల్తాన్ అంటూ అందరినీ మెప్పించేందుకు ప్రయత్నించాడు కానీ ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు. అయితే కిచ్చా సుదీప్ తెలుగులో హీరోగా సరైన సక్సెస్ సాధించలేకపోయాడు కానీ గెస్ట్ రోల్స్‌తో సుదీప్ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే బాహుబలి, సైరా సినిమాలల్లో చిన్న చిన్న పత్రాలు చేసిన ఆయన ఇప్పుడు విక్రాంత్ రోణ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ క్రమంలో సినిమా గురించి ఫస్ట్ రివ్యూ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

జూలై 28న
అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'విక్రాంత్ రోణ' మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో సుదీప్ సరసన జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించగా అనూప్ భండారి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ సమర్పణలో జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ ఈ సినిమాను నిర్మించారు. అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది.

ప్రశంశల వర్షం
ఇక ఈ సినిమాను న్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కేవలం 2 డీలోనే కాక త్రీడీలో కూడా సినిమాను విడుదల చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాపై సుదీప్ చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంశల వర్షం కురిపించారు దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు.

ష్యూర్ షాట్ హిట్
స్వయం ప్రకటిత క్రిటిక్ అయిన ఆయన ఈ సినిమా చూసి సినిమా గురించి ట్వీట్లు చేశారు. సెన్సార్ బోర్డ్ నుండి విక్రాంత్ రోణ ఫస్ట్ రివ్యూ అని పేర్కొన్న ఆయన మొత్తం మీద విక్రాంత్ రోణ పైసా వసూల్ ఎంటర్‌టైనర్ అని అన్నారు. స్పెషలిస్ట్ అయిన అనూప్ భండారి దర్శకత్వం, ఆకర్షణీయమైన కథ, ఉత్కంఠభరితమైన సినిమాటోగ్రఫీ, యాక్షన్, థ్రిల్స్ అలాగే సుదీప్ స్టారీ పెర్ఫార్మెన్స్ కలగలిపి ఇది ఒక ష్యూర్ షాట్ హిట్ గా నిలబెట్టాయని అన్నారు.

డాషింగ్‌గా
కిచ్చా సుదీప్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అతను దక్షిణాదిలో పెద్ద స్టార్ అయినప్పటికీ హిందీ మాట్లాడే ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలలో సుదీప్ భారీ యాక్షన్ అవతార్‌తో, అతను అందరినీ ఆకట్టుకున్నాడని, సుదీప్ లుక్ చాలా డాషింగ్‌గా ఉంది, విక్రాంత్‌రోణాలో అతని యాక్షన్ టాప్-క్లాస్ అని పేర్కొన్నారు.
రెండూ మైండ్ బ్లోయింగ్
కన్నడ సినిమా 2022లో భారతదేశంలో అత్యుత్తమంగా నిలబడుతుందని ఆయన అన్నారు. మొదట KGF చాప్టర్ 2 & ఇప్పుడు విక్రాంత్ రోణా రెండూ మైండ్ బ్లోయింగ్ సినిమాలే. అభిమానులు ఇక సంబరాలు మొదలు పెట్టడమే అంటూ ఆయన కామెంట్ చేశారు. మొత్తానికి ఉమైర్ దెబ్బకు సినిమాపై ఏర్పడిన అంచనాలు మరింత పెరుగుతున్నాయి అని చెప్పచ్చు. ఇక సినిమాకు గంటల వ్యవధి మాత్రమే ఉండడంతో సినిమా ఎలా ఉండనుంది అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











