వెంకటేష్ కు 'విల్లా' భయం...??

By Srikanya

హైదరాబాద్ : తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్టైన 'పిజ్జా' చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం 'విల్లా'(పిజ్జా-2). అశోక్‌, సంచితా శెట్టి జంటగా 'విల్లా' లో నటించారు. సినిమాని ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇదే రోజున వెంకటేష్,రామ్ కాంబినేషన్ లో రూపొందిన మసాలా చిత్రం విడుదల అవుతోంది. విల్లా చిత్రం ఆల్రెడి హిట్టైన పిజ్జాకు సీక్వెల్ కావటంతో మసాలా చిత్రం పై దాని ప్రభావం పడనుందా అనే సందేహాలు అంతటా కలుగుతున్నాయి.

దానికి తోడు మసాలా చిత్రంలో చాలా సన్నివేశాలు ఆల్రెడీ తెలుగులో వచ్చిన సీన్స్ తో తీసిన హిందీ సినిమా బోల్ బచ్చన్ రీమేక్ కావటం విశేషం. మరో ప్రక్క ఈ చిత్రం ప్రోమోలు సైతం ప్రేక్షకులను అలరించటంలో విఫలమయ్యాయి. వైవా బ్యాచ్ తో చేసి విడుదల చేసిన ప్రోమో అయితే చాలా ఘోరంగా ఉందని, సినిమాకి ఇంత బడ్జెట్ అయ్యిందని చెప్పుకోవటానికి మాత్రమే ఆ ప్రోమో ఉపయోగపడిందని అంటున్నారు. అయితే మసాలా చిత్రంలో రామ్ యాక్షన్ హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. గే గెటప్ లో రామ్ నవ్వులు పండిస్తాడంటున్నారు.

Villa (Pizza 2) film release on Nov 14!

'విల్లా' చిత్రం దీపన్‌.ఆర్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా తెరకెక్కింది. గుడ్‌ సినిమా గ్రూప్‌, స్టుడియో సౌత్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ -''పంపిణీదారుల్ని దృష్టిలో పెట్టుకొని మేం సినిమాను ఎంపిక చేస్తాం. అందుకే మా సంస్థ ద్వారా వచ్చిన ప్రతి సినిమా పంపిణీదారులకు లాభాలనే తెచ్చిపెట్టింది. 'విల్లా'లో ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన 'విల్లా' పాటలు, ప్రచార చిత్రాలు మంచి స్పందన చూరగొంటున్నాయి. సినిమా కూడా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని నా నమ్మకం'' అని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ... ''గతంలో వచ్చిన 'పిజ్జా'కి కొనసాగింపుగా వస్తున్న చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమాని తెరకెక్కించాం. ఇటీవల విడుదల చేసిన పాటలకి మంచి స్పందన వస్తోంది'' అన్నారు. 'పిజ్జా'కు కొనసాగింపు అనగానే... ఈ సినిమాపై అంచనాలు అధికమయ్యాయని, థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులను ఈ సినిమా ఏ మాత్రం నిరుత్సాహానికి లోను చేయదని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: దీపక్ కుమారపతి, ఎడిటింగ్: లియో జాన్ పాల్.ఎం., ఆర్ట్: మాయన్.ఎల, సౌండ్ ఎఫెక్ట్స్: అరుణ్ శీను, స్టంట్స్: బిల్లా జగన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X