తెలుసా 'విలేజ్‌లో వినాయకుడు' హిట్..
కృష్ణుడు హీరోగా వచ్చిన వినాయకుడు చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన 'విలేజ్‌లో వినాయకుడు' రిలీజై యాభై రోజులు పూర్తయిన సందర్భంగా అర్ధ శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అంటూ చిత్ర నిర్మాత మహి, దర్శకుడు సాయికిరణ్ అడివి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మట్లాడుతూ.. 'మా చిత్రం 12 కేంద్రాలలో అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మంచి కథతో చిత్రాన్ని తీస్తే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా ఆదరిస్తారన్న విషయం మా సినిమా ద్వారా మరోసారి నిరూపణైంది అన్నారు.
అలాగే 'విలేజ్‌లో వినాయకుడు' చిత్రాన్ని ఒక కోటి 39 లక్షల బడ్జెట్‌తో పూర్తి చేయడం వల్ల మా 'విలేజ్‌లో వినాయకుడు కమర్షియల్‌గా కూడా విజేతగా నిలిచాడని చెప్పారు. అలాగే తమ విజయంలో మణికాంత్ కత్రి సంగీతం, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, విజయ్ శంకర్ ప్రొడక్షన్ డిజైనింగ్, చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ అర్జున్ పనితనం భాగస్వామ్యం ఉందన్నారు. ఈ సందర్భంగా యూనిట్‌కు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించే తదుపరి చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం' అన్నారు.


Click it and Unblock the Notifications











