'విలేజ్ లో వినాయకుడు' స్టోరీ లైన్
కృష్ణుడు హీరోగా చేసిన వినాయకుడు సీక్వెల్ గా వస్తున్న విలేజ్ లో వినాయకుడు స్టోరీ లైన్ ఫన్నీగా ఉంటుంది. పల్లెటూరు అమ్మాయి శరణ్య..వినాయకుడుని చూసి ప్రేమలో పడుతుంది. అతడిని తన ఇంటికి తీసుకెళ్ళి పెద్దలకు పరిచయం చేసి పెళ్ళికి ఒప్పించాలనుకుంటుంది. అయితే అంత లావుగా ఉన్న అతన్ని చూసి ఆమె తల్లితండ్రులు షాక్ అవుతారు. ఆ పల్లెటూరు జనం కూడా విచిత్రంగా చూస్తూంటారు. ఇక అక్కడ నుంచీ వినాయుకుడు తన మంచితనంతో వారి మనస్సు ఎలా గెలుచుకున్నాడు అన్నాది మిగతా కథ. ఇక నవంబర్ ఐదున రిలీజు అవుతున్న ఈ చిత్రం మీట్ ద పేరెంట్స్ తరహాలో నవ్వులు పండిస్తుందంటున్నారు. చూద్దాం మరోసారి రొమాంటిక్ కామెడీతో వస్తున్న అడవి సాయికిరణ్ మరో మంచి హిట్ ఇస్తాడేమో.
విలేజ్ లో వినాయకుడు కృష్ణుడు అడవిసాయికిరణ్ శరణ్య మీట్ ద పేరెంట్స్ రొమాంటిక్ కామిడీ సీక్వెల్ village lo vinayakudu krishnudu saranya meetthe parents


Click it and Unblock the Notifications