twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియా నుండి ఆస్కార్‌కు ‘విలేజ్ రాక్‌స్టార్స్’

    |

    ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్లకు ప్రతి ఏడాది భారత్ తరుపు ఒక ఎంపికను అధికారికంగా పంపిస్తారు. ఈ సారి ఈ అవకాశం అసోం చిత్రం 'విలేజ్ రాక్‌స్టార్స్‌' దక్కించుకుంది. 2019లో జరగబోయే 91వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌కు భారత్‌ తరఫున ఈ చిత్రం అధికారికంగా ఎంపికైంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ఈ మూవీ ఆస్కార్ రేసులో నిలవనుంది.

    ఎస్.వి.రాజేంద్ర సింగ్ బాబు నేతృత్వంలోని 12 మంది సభ్యులు జ్యూరీ వివిధ చిత్రాలను పరిశీలించిన అనంతరం 'విలేజ్ రాక్‌స్టార్' చిత్రాన్ని ఫైనలైజ్ చేశారు. ఈ మేరకు ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) అధికారికంగా ప్రకటింది.

    Village Rockstars will be Indias official entry to Oscars next year

    ఈ చిత్రాన్ని అసోం గ్రామీణ నేపథ్యంలో కేవలం హ్యాండీ క్యామ్‌తో తెరకెక్కించారు. ఓ మారుమూల పల్లెటూరు చెందిన పదేళ్ల అమ్మాయి కష్టాలను ఓర్చి రాక్‌స్టార్‌గా ఎదిగింది అనే కథతో రీమా దాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఉత్తమ ఫీచర్‌ సినిమాగా జాతీయ అవార్డ్ సైతం దక్కింది.

    మొత్తం 28 సినిమాలు ఆస్కార్ నామినేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా.... 'విలేజ్‌ రాక్‌స్టార్స్‌'తో పాటు సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపిక, రణవీర్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన 'పద్మావత్'‌, ఆలియాభట్‌ నటించిన 'రాజీ', రాణీముఖర్జీ నటతించి 'హిచ్‌కీ' లాంటి పెద్ద చిత్రాలు సైతం ఉన్నాయి.

    ఆస్కార్ అవార్డుల చరిత్రలో ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డ్ దక్కలేదు. 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి అప్పట్లో అవార్డు దక్కినా అది నిర్మించింది, దర్శకత్వం వహించింది విదేశీయులే కావడంతో ఇండియా ఖాతాలో పడలేదు.

    ఇప్పటి వరకు భారతీయ సినిమాలు ఆస్కార్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో 5వ స్థానాన్ని దాటి ముందుకు వెళ్లలేదు. 1958లో 'మదర్‌ ఇండియా', 1989లో 'సలాం బాంబే', 2001లో 'లగాన్‌' చిత్రాలు మాత్రమే టాప్ 5 పొజిషన్ వరకు వెళ్లాయి.

    English summary
    Rima Das' Village Rockstars will be India's official entry to the Best Foreign Film category at the Oscars next year, says a Film Federation of India official.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X