twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి జీవితం నాది... చిరంజీవి-సురేఖ ఎలా ట్రీట్ చేశారో చెబుతూ బేబీ ఎమోషనల్!

    |

    పొలం పనులు చేసుకుంటూ జీవించే తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరు గ్రామానికి చెందిన 40 సంవత్సరాల బేబీ అనే మహిళలో అద్భుతమైన సింగింగ్ టాలెంట్ ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఆమె వీడియో షేర్ చేయడంతో విషయం అందరికీ తెలిసింది.

    ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి దంపతులు సంగీత దర్శకుడు కోటి ద్వారా ఆమెను తన ఇంటికి పిలిపించి అభినందించారు. మెగా దంపతులను కలిసిన అనంతరం బేబీ ఓ ఇంటర్వ్యూలో వారు తనను ట్రీట్ చేసిన విధానం గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

    నలుగురు హీరోయిన్స్.. విజయ్ రొమాంటిక్ డోస్

    నలుగురు హీరోయిన్స్.. విజయ్ రొమాంటిక్ డోస్

    'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో విజయ్ సరసన ఏకంగా నలుగురు హీరోయిన్స్ నటించారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా లీట్, క్యాథెరిన్ ట్రెసా విజయ్‌తో ఆడిపాడారు. వీళ్లంతా ఎవరికి వారు గ్లామర్ బ్యూటీలే కావడంతో సినిమాకు హీరోయిన్స్ పార్ట్ ప్లస్ అయింది. విజయ్ రొమాంటిక్ డోస్ యూత్‌ని ఆకట్టుకుంది.

    మెగాస్టార్ చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవిగారు నా కోసం ఆయన విలువైన టైమ్ కేటాయించారు. ఆ దేవుళ్లు ఇద్దరూ నన్ను కూర్చో బెట్టుకుని మాట్లాడించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారో నాతో మాట్లాడుతుంటే స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది. ఆ ఆనందంలో కళ్లవెంట నీళ్లు వచ్చేశాయి. నా సొంత చుట్టాలను చూసినట్లు, నా అన్నయ్యను చూసినట్లు ఫీలయ్యాను. సొంత మనిషిలా మాట్లాడారు... అని బేబీ గుర్తు చేసుకున్నారు.

    చరన్, బన్నీ సినిమాల్లో ఛాన్స్ ఇస్తామన్నారు

    చరన్, బన్నీ సినిమాల్లో ఛాన్స్ ఇస్తామన్నారు

    సైరా సినిమా ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ సినిమాలో అవాకశం ఉండక పోవచ్చు అన్నారు. రామ్ చరణ, అల్లు అర్జున్ సినిమాలో తప్పకుండా అవకాశం ఇప్పిస్తామని చెప్పారు. వాళ్ల సినిమాలో తప్పకుండా అవకాశం దొరుకుతుందని ఆశ పడుతున్నాను... అని బేబీ తెలిపారు.

     చిరంజీవి గారికి నేను ఫ్యాన్ అయితే సురేఖగారు నాకు ఫ్యాన్

    చిరంజీవి గారికి నేను ఫ్యాన్ అయితే సురేఖగారు నాకు ఫ్యాన్

    చిరంజీవి గారికి నేను ఫ్యాన్ అయితే సురేఖగారు నాకు ఫ్యాన్. నా పాట రోజూ వినేవారట. ఆమె నాతో ఆ విషయం చెబుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎంతో మంది గొప్ప సింగర్లు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ ఇది నా గొప్పతనం కాదు. సురేఖగారు నా పాట ఇష్టపడటం ఆమె గొప్పతనమని బేబీ అన్నారు.

    ముడతపడిన చీరలు కట్టిన జీవితం నాది

    ముడతపడిన చీరలు కట్టిన జీవితం నాది

    నాకు చిరంజీవి అన్నయ్యగారు, సురేఖ వదినమ్మగారు పట్టుచీరలు బహుతులుగా ఇచ్చారు. ఇది నాకు దక్కిన మహాభాగ్యంగా భావిస్తాను. ఇంత ఖరీదైన చీరలు నేను ఎప్పుడూ కట్టలేదు. ముడతపడిన చీరలు కట్టిన జీవితం నాది. అలాంటిది నా పాట విని, నన్ను అభిమానించి, నన్ను ఇష్టపడి ఇవన్నీ ఇవ్వడం నా అదృష్టం. నా జన్మకు ఇది చాలు అనిపించింది.

     సినిమా ఫంక్షన్లు సమయంలో పిలిపిస్తామన్నారు

    సినిమా ఫంక్షన్లు సమయంలో పిలిపిస్తామన్నారు

    ఏదైనా సినిమా ఫంక్షన్ జరిగినపుడు నన్ను తప్పకుండా తీసుకురావాలని కోటిగారిని అడిగారు. నేను మళ్లీ చిరంజీవిగారి ఇంటికి తప్పకుండా వెళతాను అనే నమ్మకం ఉంది.... అంటూ ఆనందం వ్యక్తం చేశారు బేబీ.

    English summary
    Village Singer Baby Gets Very Emotional About Mega Star Chiranjeevi's Family. Music director Koti garu introducing singer Baby to Megastar Chiranjeevi. 40-year-old Baby, of Vadisaleru village in East Godavari district, impresses the online world with her rendition of O Cheliya from 1994 movie Premikudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X