విలేజ్ లో వినాయకుడు రిలీజ్ డేట్
కృష్ణుడు ప్రధానపాత్రలో సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో రెడీ అవుతున్న విలేజ్ లో వినాయకుడు చిత్రం నవంబర్ ఐదున రిలీజ్ కానుంది. క్రితం సంవత్సరం వచ్చిన వినాయకుడు చిత్రానికి సీక్వెల్ గా తయారైన ఈ చిత్రంలో కృష్ణుడు సరసన శరణ్య హీరోయిన్ గా పరిచయమవుతోంది. పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఈ చిత్రం చందమామ కథలా ఆహ్లాదంగా ఉంటుందని దర్శకుడు చెపుతున్నాడు.అలాగే ఈ చిత్రం పూర్తి స్ధాయిలో వినోదాత్మకంగా ఉంటుందని దర్శక,నిర్మాతలు హామీ ఇస్తున్నారు. మణికంఠ కాద్రి అందించిన ట్యూన్స్ ఇప్పటికే ఛాట్ బస్టర్ గా మారాయి. రమణ సెల్వా కెమెరా అందించిన ఈ చిత్రాన్ని మహి నిర్మిస్తున్నారు.
వినాయకుడు సీక్వెల్ కృష్ణుడు సాయి కిరణ్ అడవి విలేజ్ లో వినాయకుడు శరణ్య మణికంఠ కాద్రి మహి రమణ సెల్వా villagelo vinayakuudu krishnudu sai kiran adavi saranya release date


Click it and Unblock the Notifications