విలన్ టు హీరో - హీరో టు విలన్
గోపిచంద్ 9లో అడుగుపెట్టాడు. ఇప్పటికి గోపిచంద్ సినీ రంగప్రవేశం చేసి 9సంవత్సరాలు పూర్తయింది. ఈ మద్య కాలంలో ఆయన ఎన్నోఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. టి కష్ణ కుమారుడుగా తొలివలపు సినిమాతో, హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఆ సినిమా గోర పరాజయం కావడంతో ఇంటికే పరిమితమైయ్యాడు. గోపిచంద్ ని మీతో సినిమా చేస్తామని పలకరించే వారే కరువయ్యారు. ఆ సమయంలో తేజ ఇతని ఇంటితలుపు తట్టాడు. నీతో సినిమా చేస్తామన్నాడు. అయితే గోపిచంద్ హీరోకాదు...విలన్.
కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వద్దన్నాతాను సినీరంగంలో నిలదొక్కుకోగలను అనే నమ్మకంతో గోపిచంద్ జయం సినిమాలో విలన్ పాత్రకు ప్రాణం పోశాడు. ఆ సినిమా హిట్ కావడానికి గోపిచంద్ హైలెట్ గా నిలిచాడు. తర్వాత వర్షంతో పాటు రెండు మూడు సినిమాలలో విలన్ గా నటించి తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. ఆ తర్వాత రణం, ఒక్కడున్నాడు, లక్ష్యం, శౌర్యం సినిమాలలో నటించాడు. ప్రస్తుతం గోలిమార్ సినిమాతోవిజయపతంలో దూసుకుపోతున్నాడు. తన సినీ జీవితంలో గోలిమారే పెద్ద హిట్ అని బర్త్ డే బాయ్ గోపిచంద్ అంటున్నాడు. పూరి జగన్నాథ్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అంటున్నాడు. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తే తాను నటించడానికి సిద్దంగా ఉన్నానని అన్నాడు.
ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుందని, అయితే తనకు నచ్చిన పాత్రలు నిర్మాతల తలపై రుద్ది వారి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టంలేదని గోపిచంద్ అంటున్నాడు. రాజమౌళి, వివి వినాయక్, శ్రీనువైట్ల దర్శకత్వంలో, అదేవిధంగా తమిళంలో నటించాలని తన మనస్సులో మాట వెల్లడించారు. తన ఆశ నెరవేరాలని ఆకాంక్షిస్తూ దట్స్ తెలుగు తరపున గోపిచంద్ కి జన్మదిన శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











