మైండ్ రీడర్ చెప్పే "స్పెషల్" కథ: అజయ్ హీరోగా రానున్న థ్రిల్లర్ మూవీ

నటుడు అజయ్ ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నాడు దిక్కులు చూడకు రామయ్య లాంటి సినిమా తర్వాత పెద్దగా తెరమీద కనిపించని ఈ నటుడు ఇప్పుడు అద్బుతమైన థ్రిల్లర్ కథాంశం తో వస్తున్నాడు. అదే "స్పెషల్"

వాస్తవ్ దర్శకత్వం లో అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం స్పెషల్. ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న సినిమా టాలీవుడ్ దృష్టిని ఆకర్శిస్తోంది. నిజానికి అజయ్ టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ నటుడు. అటువిలన్ గానూ, ఇటు సపోర్టింగ్ క్యారెక్టర్లలోనూ మెప్పించిన అజయ్ పాపం హీరో కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నా ఆ రూట్లో సక్సెస్ కాలేక పోయాడు. విక్రమార్కుడు, పోకిరీ లాంటి సినిమాల్లో అజయ్ నటనకు అద్బుతమైన మార్కులు పడ్డాయి. సారాయి వీర్రాజు లాంటి సినిమా వచ్చి అందులో అజయ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి గానీ సినిమా ఇతరకారణాలతో ఫ్లాప్ అనే ముద్ర పడటం తో అది అజయ్ కెరీర్ మీద పెద్ద ప్రభావమే చూపించింది. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా అద్బుతమైన థ్రిల్లర్ కథాంశం తో వస్తున్నాడు. అదే "స్పెషల్"

 ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్

ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్

ద స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ సబ్ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీలో అజయ్‌ది స్పెషల్ రోల్ అని చెబుతున్నాయి సినీ వర్గాలు.. హాలివుడ్ తరహాలో స్క్రిప్ట్ ఉంటుందని, ఆజయ్ తన నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశాడని డైరెక్టర్ వాస్తవ్ చెబుతున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న అజయ్ కెరీర్ కి ఈ సినిమా మళ్ళీ కొత్త బాట వెయ్యొచ్చనేది ఒక టాక్ .. ఈ సినిమా ఇప్పటికే నలభై రోజుల పాటు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.. హైదరాబాద్, మాల్దీవుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. క్లైమాక్స్ మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఒక్క పాట మాత్రమే

ఒక్క పాట మాత్రమే

కథ డిమాండ్‌ను బట్టి సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉంటుందని సమాచారం.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న ఈ మూవీ టీజర్‌ను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.. ఐతే తాజాగా బైటకు వచ్చిన ఈ మూవీ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది..

 నందలాల్ క్రియేషన్స్

నందలాల్ క్రియేషన్స్

నందలాల్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ హీరో అజయ్ కూడా పాల్గొని కొన్ని సినిమా విశేషాలని పంచుకున్నారు.

మైండ్ రీడింగ్ అనే నూతన పాయింట్‌

మైండ్ రీడింగ్ అనే నూతన పాయింట్‌

ప్రేమ, ఫాంటసీ, ప్రతీకారం అంశాలతో ముడిపడిన కథ ఇది. మైండ్ రీడింగ్ అనే నూతన పాయింట్‌తో హాలీవుడ్ శైలిలో సాగుతుంది. ఇన్వెస్టిగేటివ్ అజయ్ పాత్ర సినిమాకు ప్రధానబలంగా నిలుస్తుంది. మాల్దీవులు, హైదరాబాద్‌లో నలభైరోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరిపాం. మూడు రోజుల టాకీపార్ట్ మినహా షూటింగ్ పూర్తయింది అని తెలిపారు., నటుడిగా మంచి సినిమా చేస్తున్నాననే సంతృప్తి కలుగుతుందని అజయ్ పేర్కొన్నారు. రంగా, అశోక్‌కుమార్, అక్షత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అమర్, సంగీతం: మణ్యం యన్.వి.ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X