Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రియమణి, హీరోని, డైరక్టర్ ని తన కంట్రోల్లో పెట్టుకొందని విమల ఆక్రోశం....
'రాజ్" సినిమా విషయంలో ప్రియమణి హీరో సుమంత్ తో కుమ్మక్కయి చాలా రాజకీయాలు చేసిందని వదంతులొచ్చాయి. అందులో నటించిన మరో హీరోయిన్ విమలా రామన్ పై ప్రియమణి పెత్తనం చలాయించిందని, నిర్మాతల్ని, హీరోని తన కంట్రోల్ లో పెట్టుకుని విమల క్యారెక్టర్ ని కుదించినందని గుసగుసలు వినిపించాయి. కాదని గట్టిగా చెప్పిన దర్శకుడిని కూడా తొలగించి, విఎన్ ఆదిత్యకి సగం నుంచి బాధ్యతలు అప్పగించారని కూడా అన్నారు. పబ్లిసిటీ విషయంలోనూ విమలని పక్కకి నెట్టి ప్రియమణి సోలో హీరోయిన్ అయినట్టుగా మొత్తం బాధ్యత తానే తీసుకుంది ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న విమలా రామన్ ఎట్టకేలకు ఓపెన్ అయింది.
ప్రియమణి, సుమంత్ రాజ్ పేర్లు ఎత్తకుండానే తన ఆక్రోశం బయటపెట్టింది. మొదట చెప్పినదానికి, తర్వాత తీసేదానికి, థియేటర్లోకి వచ్చిన దానికి కొన్నిసార్లు సంబంధమే ఉండదని, కానీ నిజాయితీగా కృషి చేస్తే ఏనాటికైనా ఫలితం ఉంటుందని విమల 'రాజ్" ని ఉద్దేశించి కామెంట్ చేసింది.