‘చుక్కలాంటి అమ్మాయి’కి గాయం!
'ఎవరైనా ఎప్పుడైనా" చిత్రం లో వరణ్ సందేశ్ తో రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైనా అబ్బాయి" చిత్రంలో నటిస్తున్న మళయాళం బ్యూటి విమలారామన్ తాజాగా జగపతిబాబు సరసన నటించే అవకాశం దక్కించుకుంది. జగపతిబాబు హిట్ చిత్రాల్లో ఒకటైన 'గాయం"కు కొనసాగింపుగా దర్మకర్త నిర్మాణం, ప్రవీన్ శ్రీ దర్శకత్వలో రూపొందుతున్న 'గాయం-2" చిత్రంలో హీరోయిన్ గా విమలారామన్ ఎంపికైంది.
నిజానికి 'అబద్దం" చిత్రంతోనే విమలారామన్ తెలుగు చిత్రసీమకు పరిచమైంది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఆ చిత్రం కె.బాలచందర్ దర్శకత్వంలో తమిళ, తెలుగు బాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందింది. అయితే 'పొయ్" పేరుతో తమిళంలో, 'అబధ్దం" పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం పాలు కావడంతో ఈ చుక్కలాంటి అమ్మాయి"కి చుక్కెదురైంది. దాంతో కొంచెం విరామం తీసుకుని 'ఎవరైనా ఎప్పుడైనీ" చిత్రంతో ఫున:ప్రవేశించింది. ఆ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఆ చిత్రంలో విమలారామన్ కూడా ఉదారంగా ఆరబోసిన అందాలు అందరి దష్టినీ విశేషంగా ఆకర్షించడంతో. ఈ భామకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. అందులో భాగంగానే 'గాయం-2" చిత్రంలో నటించే అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ స్వంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











