బికినీ ధరించటం గూర్చి నగ్న సత్యం వివరించిన విమలా రామన్
తెరపై మొహమాటం లేకుండా శృంగారం ఒలకపోసే తారల్లో రీసెంట్ రోజుల్లో చెప్పుకోవాలంటే విమలారామన్ ముందుంటుంది. ఆమెను తాజాగా బికిని ధరించటంపై మీ అబిప్రాయం ఏమిటీ అని మీడియావారు ప్రశ్నించారు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని వారు షాకయ్యారు...బికినీ వేసుకుంటే జనాలు ఎగపడతారు అనుకుంటే...ప్రతీ డైరక్టర్ తన సినిమా సక్సెస్ అవటానికి అదో దగ్గర దారిగా భావించే అదే పనిలో ఉంటాడు. కానీ అలా ఎందుకు జరగటం లేదు...అంటే బికినీ వల్ల సినిమాకి పెద్దగా ఉపయోగం ఉండదనే కదా..క్యారెక్టరక్ డిమాండ్ చేస్తే తప్పదు..కానీ పనిమాలా బికినీ వేస్తే భాక్సాఫీస్ ఏమీ బ్రద్దలైపోదు అని నిక్కచ్చిగా బికీనీ వేదాంతం వివరించింది విమలారామన్. ప్రస్తుతం విమలారామన్ రాజశేఖర్ సరసన చట్టం చిత్రంలోనూ, తరుణ్ సరసన చుక్కలాంటి అమ్మాయి...చక్కనైన అబ్బాయి చిత్రం, సుమంత్ సరసన వియన్ ఆదిత్య దర్శకత్వంలో రాజ్ చిత్రంలోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











