విజయశాంతితో పోల్చి మాట్లాడుతున్నారు
పోలీస్ పాత్ర అంటే ముందుగా ఎవరికైనా విజయశాంతి గుర్తొస్తారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నువ్వేమైనా విమలా శాంతివా అని నన్ను చాలామంది ఆటపట్టించారు అంటోంది విమాలా రామన్. ఆమె తాజా చిత్రం రంగ..ది దొంగ చిత్రంలో ఆమె పోలీసు ఆఫీసర్ గా చేసింది. ఆ సందర్బంగా ఆమె విజయశాంతిని ఫాలో అయ్యింది.ఈ విషయమే చెబుతూ..ఇలా స్పందించింది. అలాగే...ఆమె నటించిన యాక్షన్ మూవీస్‌ని చూశాను. విజయశాంతి అద్భుతమైన నటి. నేనిప్పుడిప్పుడే పైకొస్తున్నాను. ఆమెతో నన్ను పోల్చవద్దని చెప్పాను. కాకపోతే మంగమ్మ పాత్రకి న్యాయం చేయడానికి నా శాయశక్తులా కృషి చేశాను.
ఈ మధ్యకాలంలో నాకు గాయం2 తర్వాత మళ్లీ రంగ ది దొంగ లో అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా చేయాలని జీవీగారు చెప్పగానే నేను థ్రిల్ అయ్యాను. ఇప్పటివరకు మీకు కనిపించిన విమలా రామన్ వేరు. రంగ ది దొంగలో కనిపించే విమల వేరు. ఇందులో అమలాపురం యువతిగా నటించాను. గోదావరి యాసలో మాట్లాడుతూ నేను చేసిన ఈ మంగమ్మ పాత్ర అందర్నీ అలరిస్తుంది. రంగ ది దొంగలో రమ్యకృష్ణ నటించారు. మా ఇద్దరికీ చెన్నయ్ లోనే పరిచయం ఉంది. ఈ చిత్రంలో ఆమె నీలాంబరి తరహా పాత్ర చేశారు అంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











