విమలా రామన్ బాలీవుడ్ ఎంట్రీ!
హీరోయిన్ విమలా రామన్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. సునీల్‌శెట్టి, గోవింద ప్రధాన పాత్రల్లో నటించనున్న 'అఫ్రా టఫ్రీ' చిత్రంలో ఈ సుందరి కథానాయికగా ఎంపికైంది. హాదీ అలీ అబ్రార్ దర్శకుడు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని బాలీవుడ్ సమాచారం. 2011లో విడుదలైన 'డ్యామ్ 999' అనే హాలీవుడ్ చిత్రంలో కూడా ఈ సుందరి నటించింది. ప్రస్తుతం తెలుగులో 'కులుమనాలి' చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌లో అవకాశం రావడం పట్ల విమలారామన్ పట్టరాని ఆనందంతో వుంది.
అయితే దక్షిణాదినే సరిగా రాణించ లేక పోతున్న విమలా రామన్ బాలీవుడ్‌లో పోటీని తట్టుకుని నిలబడగలుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దక్షిణాదిన అగ్రస్థానంలో దూసుకెళ్లిన త్రిష, అసిన్‌లు హిందీ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలియానా కూడా 'బర్ఫీ' చిత్రంలో నటిస్తోంది. వీరిలో ఆసిన్ మాత్రమే అంతంత మాత్రంగా రాణిస్తుండగా త్రిష చతికిల పడి మళ్లీ సౌత్ ముఖం పట్టింది. మరి విమలా రామన్ పరిస్థితి ఏమిటో చూడాలి.


Click it and Unblock the Notifications











