'వినయ విధేయ రామ' డే1 కలెక్షన్స్.. కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం భారీ అంచనాల నడుమ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి డివైడ్ టాక్ ప్రారంభం అయింది. బోయపాటి శ్రీను దర్శత్వంలో రాంచరణ్ నటిస్తున్న తొలి చిత్రం కావడం, రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత వస్తుండడంతో వినయ విధేయ రామపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనితో సినీ విశ్లేషకులు ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయని అంచనా వేశారు. అంచనాలకు తగ్గట్లుగా వినయ విధేయ రామ చిత్ర వసూళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

కళ్ళు చెదిరే ఓపెనింగ్స్
ఆంగ్ల పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం వినయ విధేయ రామ చిత్ర తొలి రోజు గ్రాస్ కళ్ళు చెదిరే విధంగా ఉండబోతోందని ఆంగ్ల పత్రికలు తెలుపుతున్నాయి. ఈ చిత్రం తొలి రోజు 40 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశం ఉందట. రంగస్థలం చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 44 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వినయ విధేయ రామ చిత్రం డివైడ్ టాక్ తో ప్రారంభమైనప్పటికీ ఓపెనింగ్స్ అదిరేలా ఉండడం విశేషం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నాన్ బాహుబలి రికార్డ్
వినయ విధేయ రామ చిత్రం కొన్ని ఏరియాలలో నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ పీఆర్వో వెల్లడిస్తూ.. చరణ్, బోయపాటి కాంబోలో వచ్చిన ఈ చిత్రం గుంటూరు ఏరియాలో తొలి రోజు 4 కోట్ల షేర్ రాబట్టిందని తెలిపారు. గుంటూరులో ఇది నాన్ బాహుబలి రికార్డ్. బాహుబలి 2 చిత్రం ఈ ఏరియాలో తొలి రోజు 6 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.

తొలి రోజు షేర్ అంచనా
వినయ విధేయ రామ తొలి రోజు షేర్ 25 కోట్లకు పైగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్ తో రూపొందిన చిత్రం కావడంతో తొలి రోజు వసూళ్లు ఆసక్తి రేపుతున్నాయి. నెల్లూరులో కూడా వినయ విధేయ రామ చిత్రం బాహుబలి తర్వాతి స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. నెల్లూరులో వినయ విధేయ రామ చిత్రం 1.6 కోట్ల షేర్ సాధించినట్లు వార్తలువ్ వస్తున్నాయి. ఈ చిత్ర తొలి రోజులు వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంక్రాంతి సీజన్
వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికి సంక్రాంతి సెలవులు ఈ చిత్రానికి కలసి వచ్చే అవకాశం ఉంది. రాబోవు రోజుల్లో వినయ విధేయ రామ వసూళ్లు ఏమేరకు ఉంటాయనేది ఆసక్తిగా మారింది. రాంచరణ్ కు జోడిగా ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించాడు. స్నేహ, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











