రామ్ చరణ్ ‘ప్లాప్’ స్టేట్మెంటును... బోయపాటి జీర్ణించుకోలేక పోతున్నారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన 'వినయ విధేయ రామ' చిత్రం సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలై... ఊహించని విధంగా బాక్సాఫీసు రేసులో బోల్తాపడింది. బోయపాటి మాస్ ఓవర్ డోస్, అసహజంగా డిజైన్ చేసిన కొన్ని యాక్షన్ సీన్లు బెడిసి కొట్టడమే ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు.

హీరో రామ్ చరణ్ సైతం సినిమా పరాజయాన్ని ఒప్పుకుంటూ అభిమానులకు బహిరంగ లేఖ రాయడం, అందరూ కష్టపడి పని చేశాం కానీ... మిమ్మల్ని మెప్పించలేక పోయాం అంటూ క్షమాపణలు కోరడం హాట్ టాపిక్ అయింది. చరణ్ రాసిన ఈ బహిరంగ లేఖపై అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అయితే చరణ్ ఈ లేఖ రాయడాన్ని దర్శకుడు బోయపాటి జీర్ణించుకోలేక పోతున్నారట.

బోయపాటి పేరు ప్రస్తావించని చరణ్

బోయపాటి పేరు ప్రస్తావించని చరణ్

రామ్ చరణ్ తన బహిరంగ లేఖలో ఎక్కడా కూడా దర్శకుడు బోయపాటి పేరు ప్రస్తావించలేదు. ఎవరినీ తప్పుబట్టకుండా అంతా కష్టపడి పని చేశాం, కానీ వర్కౌట్ కాలేదని మాత్రమే తెలిపారు. వాస్తవానికి బోయపాటికి ఈ లేఖ రాయడం ఇష్టం లేదట. అందుకే రామ్ చరణ్ తన లేఖలో ఆయన పేరు ప్రస్తావించలేదట.

ఈ ప్లాప్ ఎఫెక్ట్ ఎవరిపై?

ఈ ప్లాప్ ఎఫెక్ట్ ఎవరిపై?

ఒక భారీ విజయం అందుకున్న తర్వాత ఒక స్టార్ హీరో సినిమా ప్లాప్ అయిందంటే... ఆ ఎఫెక్ట్ ఎవరిపై ఎక్కువ పడుతుంది అంటే దర్శకుడిపైనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే బోయపాటి ఈ లేఖపై అయిష్టంగానే ఉన్నారట. ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.

ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి

ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి

తను తీసిన సినిమా ఆడక పోతే.. ప్లాప్ అయిందని ఒప్పుకుంటూ స్వయంగా హీరోనే స్టేట్మెంట్ రిలీజ్ చేయడం లాంటి సంఘటన బోయపాటి తన కెరీర్లో తొలిసారి ఎదుర్కొన్నారు. దీనిపై ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక సైలెంట్ అయిపోయారట.

తానేంటో నిరూపించుకోవాలనే కసి మరింత పెరిగిందా?

తానేంటో నిరూపించుకోవాలనే కసి మరింత పెరిగిందా?

‘వినయ విధేయ రామ' సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే బోయపాటి మరో సినిమాకు కమిట్ అయ్యారు. త్వరలో ఆయన బాలయ్యతో మూవీ చేయబోతున్నారు. ‘వినయ విధేయ రామ' ప్లాప్ ఎఫెక్ట్ తన కెరీర్ మీద పడకుండా ఉండేందు మరింత పట్టుదలతో హిట్ కొట్టాలనే కసితో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

హిట్టు కొడితేనే టాప్ స్టార్లతో అవకాశం

హిట్టు కొడితేనే టాప్ స్టార్లతో అవకాశం

బోయపాటి నెక్ట్స్ బాలయ్యతో చేయబోయే సినిమాతో తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేక పోతే టాప్ స్టార్లతో చేసే అవకాశాలు క్రమంక్రమంగా తగ్గిపోయే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X