‘వినయ విధేయ రామ’... రిలీజ్ రోజే రామ్ చరణ్ సినిమాకు పెద్ద దెబ్బ!
తెలుగు సినిమా ఇండస్ట్రీని వేధిస్తున్న వాటిలో ప్రధానమైన సమస్య పైరసీ. సినిమా థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్ లైన్‌లో పైరసీ దర్శనమిస్తోంది. తాజాగా సంక్రాంతికి విడుదలైన సినిమాలను టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్ పైరసీ ముఠాలు మరోసాయి రెచ్చిపోయాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ ముఠాలు మొత్తం మూవీని ఆన్‌లైన్లో పెట్టేశాయి.

కలెక్షన్లపై భారీగా ప్రభావం....
సినిమా రిలీజ్ రోజే ఆన్ లైన్ పైరసీ దర్శనమివ్వడంతో కలెక్షన్లపై ప్రభావం పడనుంది. అసలే సంక్రాంతికి థియేటర్లు తక్కువ దొరికాయని డిస్ట్రిబ్యూటర్లు బాధ పడుతుంటే... ఇపుడు పైరసీ సమస్య వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

తగిన చర్యలేవి?
ఈ మధ్యకాలంలో రిలీజైన ప్రతి సినిమా పైరసీకి గురవుతోంది. అయితే వాటిపై తగిన చర్యలు తీసుకోవడంలో ఇటు ఇండస్ట్రీ పెద్దలు, అటు యాంటీ పైరసీ సెల్ విఫలం అవుతూనే ఉంది. దీంతో సంక్రాంతి సినిమాలపై పైరసీ దెబ్బ గట్టిగానే పడింది.
నిర్మాతలు కూడా లైట్ తీసుకుంటున్నారా?
అయితే నిర్మాతలు కూడా ఆన్ లైన్ పైరసీ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. పైరసీ అరికట్టాలని, ఏవైనా పైరసీ లింక్స్ కనిపిస్తే రిపోర్ట్ చేయాలని ఒక సందేశం పోస్ట్ చేసి వదిలేయడం తప్ప...ముందే సినిమా పైరసీకి గురికాకుండా అడ్డుకోవడంలో ఫెయిలవుతున్నారు.

భారీగా ఖర్చు
డివివి ఎంర్టెన్మెంట్స్ సంస్థ వినయ విధేయ రామ చిత్ర నిర్మాణం, ప్రమోషన్స్ కోసం దాదాపు రూ. 70 కోట్ల వరకు ఖర్చు చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఈ వీకెండ్ గడిస్తేకానీ చెప్పలేం.


Click it and Unblock the Notifications











