కేక పెట్టిస్తున్న వినయ విధేయ రామ కొత్త పోస్టర్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. బోయపాటి శ్రీను అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 27 భారీ స్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నారు. మెగా అభిమానులంతా వినయ విధేయ రామ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసే సమయాన్ని తెలియజేస్తూ తాజగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. రాంచరణ్ హార్స్ రైడింగ్ చేస్తున్న ఈ పోస్టర్ అభిమానులచేత కేక పెట్టించే విధంగా ఉంది. రాంచరణ్ కు హార్స్ రైడింగ్ లో మంచి ప్రావీణ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మగధీర చిత్రంలో చరణ్ హార్స్ రైడింగ్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రేపు ప్రీరిలీజ్ వేడుకలో 9 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు.

దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఈ చిత్ర పాటలు కూడా రేపే విడుదల కానున్నాయి. రాంచరణ్ సరసన ఈ చిత్రం కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. వినయ విధేయ రామ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ అదిరిపోయిందంటూ రానా, అల్లు శిరీష్ ట్వీట్ చేశారు. గెట్ రెడీ అంటూ ఉపాసన ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











