అబ్బో.. రొమాంటిక్ యాంగిల్.. అమ్మాయిలతో 'వినయ విధేయ రామ', ఉపాసన ఆల్రెడీ!

Recommended Video

Vinaya Vidheya Rama New Poster Looks Very Beautiful | Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. మాస్ చిత్రాలని తెరకెక్కించడంలో బోయపాటి సిద్ధహస్తుడు. ఇక రాంచరణ్ కు మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనితో వినయ విధేయ రామ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. చిత్ర యూనిట్ విడుదల చేసిన రొమాంటిక్ పోస్టర్ వైరల్‌గా మారుతోంది.

రొమాంటిక్ యాంగిల్

రొమాంటిక్ యాంగిల్

బోయాపాటి శ్రీను సిద్ధం చేస్తున్న రామ్.. కొణిదెలలో వినయం, విధేయత మాత్రమే కాదు.. రొమాంటిక్ యాంగిల్ కూడా పుష్కలంగా ఉంది. తాజాగా చిత్ర యూనిట్ విడుదుల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంచరణ్ చుట్టూ చేరిన అమ్మాయిలతో కలసి కొబ్బరి బోండంలు తాగుతున్న స్టిల్ అద్భుతంగా ఉంది. అందమైన అమ్మాయిల మధ్య వినయ విధేయ రాముడు స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

తొలి పాట సిద్ధం

వినయ విధేయ రామ చిత్రంలో పాటల సందడి మొదలు కాబోతోంది. డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ విడుదల చేయనున్నారు. తందానే తందానే అంటూ సాగే ఫ్యామిలీ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేసింది. టీజర్ లో మాస్ లుక్ లో కనిపించిన చరణ్ తాజా పోస్టర్ లో క్లాస్ గా ఉన్నాడు.

ఉపాసన ఆల్రెడీ

ఉపాసన ఆల్రెడీ

ఇప్పటికే ఆ పాటని తాను వినేశానని ఉపాసన సోషల్ మిడియా ద్వారా ప్రకటించింది. పాట అద్భుతంగా ఉందంటూ రాంచరణ్ తాజా పోస్టర్ ని జత చేసింది. రాంచరణ్ గురించి ఏ విశేషం ఉన్నా ఉపాసన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. సంక్రాంతి కానుకగా వినయ విధేయ రామ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

 దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండడం విశేషం. ఆర్యన్ రాజేష్, తమిళ హీరో ప్రశాంత్, సీనియర్ హీరోయిన్ స్నేహ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X