అక్కడ మాత్రమే ఊపేస్తుంది, ‘వినయ విధేయ రామ’ పబ్లిక్, ఫ్యాన్ టాక్... (వీడియో)
Recommended Video

రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' చిత్రానికి పబ్లిక్, ఫ్యాన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో ఫైట్స్, పాటలు బావున్నాయని, రామ్ చరణ్ అదరగొట్టారని కొందరు అంటుంటే, సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే రామ్ చరణ్ అభిమానులు మాత్రం... ఈ సంక్రాంతి విన్నర్ రామ్ చరణే అంటున్నారు. సినిమా చూస్తుంటే తెరపై కొణిదెల సింహాన్ని చూసినట్లు ఉందంటూ మరికొందరు తమ సంతృప్తి వ్యక్తం చేశారు.

పర్ఫెక్ట్ కాంబినేషన్
మాస్ హీరోకు మాస్ డైరెక్టర్ తోడవ్వటంతో సినిమా ఔట్‌పుట్ పర్ఫెక్టుగా వచ్చింది. సెకండాఫ్‌లో ఒక ఫైట్ అభిమానులకు విజువల్ ట్రీట్‌లా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎక్స్‌పెక్టేషన్స్ వద్దు, ఓన్లీ ఊరమాస్...
సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇది ఓన్లీ ఊరమాస్ సినిమా. అభిమానులకు బీభత్సంలా ఉంటుంది. డైరెక్టర్ ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ మీదనే ఎక్కువ పోకస్ పెట్టాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఆ చిట్టిబాబు వేరు ఈ కొణిదెల వేరు
‘రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ స్థాయిని వినయ విధేయ రామ రీచ్ కాలేదు. ఆ చిట్టిబాబు వేరు... ఈ కొణిదెల వేరు. బి, సి సెంటర్లలో సినిమా ఊపేస్తుంది. ‘ఏ' సెంటర్లలో ఆశించిన ఫలితాలు రాక పోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఫైట్స్, సాంగ్స్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ సూపర్
సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయని, ప్రతి అభిమాని మెచ్చే విధంగా బోయపాటి ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్‌తో రూపొందించినట్లు చెబుతున్నారు.
చరణ్‌తో తీసే సినిమా కాదు...
అయితే కొందరు మాత్రం సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రామ్ చరణ్‌తో చేసే సబ్జెక్టు కాదని, బోయపాటి తన గత సినిమాల ఛాయల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని మరికొందరు సూచించారు.


Click it and Unblock the Notifications











