వినాయిక్ రైట్ హ్యాండ్ మరణం..బాధాకరం
దర్శకుడు వివి వినాయిక్ కి పర్మనెంట్ కో డైరక్టర్ గా,రైట్ హ్యాండ్ గా ఉన్న తోట రామ కృష్ణ రెండు రోజుల క్రితం మృతి చెందారు.హైదరాబాద్ లోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరణించారు.అయితే ఆయన మరణానికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియకపోయినా అంతకుముందు రోజు బాత్రూమ్ లో పడటంతో ఆస్పత్రికి తరలించారని,వెళ్ళిన దగ్గరనుంచి ఆయన అన్ కాన్సిషస్ స్ధితిలోనే ఉండి మరణించారని తెలుస్తోంది.ఇక ఆయన మృతికి తెలుగు ఇండస్ట్రీలో పెద్దలంతా తరలి వెళ్లి శ్రధ్దాంజలి ఘటించారు.నిజానికి వినాయిక్ తాజా చిత్రం రామ్ చరణ్ తో చేస్తున్న దానికి కూడా ఆయనే కో డైరక్టర్.అయితే దురదృష్టవశాత్తు ఆయన ఈ సినిమా చెయ్యలేకపోయారు.దర్శకుడు వినాయిక్ కెరీర్ ప్రారంభం నుండీ ఆయన అతనితో ఉన్నారు.అంతకుముందు బి గోపాల్ తో ఆయన సినిమాలు చేసారు.ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.తెలుగు ఫిల్మ్ డైరక్టర్స్ అశోశియేషన్ ఆయన మృతికి సంతాపం ప్రకటించింది.
ఇక వినాయిక్,రామ్ చరణ్ ల సినిమా విషయానికి వస్తే..ఆకుల శివ అందించిన కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది.రచ్చ చిత్రం తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది.యూనివర్సల్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. దర్శకుడు వినాయక్ చిత్రం గురించి చెబుతూ ''చిరంజీవిగారితో 'ఠాగూర్' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తామో త్వరలో చెబుతాం. యువరాజు పెళ్లి ఉంది కదా? దానికి ముందా? తరవాత? అనేది ఇంకా నిర్ణయించలేదు. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications











