రామ్ చరణ్‌తో వినాయక్ మూవీకి ఆ టైటిలే ఖరారు
హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా యూనివర్సల్ మీడియా సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కాజల్, అమలాపాల్ హీరోయిన్స్ చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రానికి 'నాయక్' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. తొలి నుంచీ ఈ సినిమాకి 'చెర్రీ' అనే పేరు ప్రచారంలో ఉంది. అటు మాస్‌నీ, ఇటు యువతనీ ఆకట్టుకొనే పేరు కోసం అన్వేషించారు. కథరీత్యా 'నాయక్' వైపే యూనిట్ మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
సూపర్ హిట్ 'మగధీర'లో కాలభైరవగా, హర్షగా రెండు రకాల పాత్రలు చేసి, మెప్పించిన రామ్‌చరణ్ మళ్లీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో యూనివర్శల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో చరణ్ రెండు పాత్రలు చేస్తున్నారు. ఒక్క 'అరంజ్' తప్ప చరణ్ నటించిన మిగతా మూడు చిత్రాల టైటిల్స్ పవర్‌ఫుల్‌గానే ఉన్నాయి. ఇక, మాస్ డెరైక్టర్ వినాయక్‌తో చేస్తున్న చిత్రం కావడంవల్ల కచ్చితంగా ఈ చిత్రానికి ఎనర్జిటిక్ టైటిల్‌నే పెడతారనే అంచనాలు ఉండేవి.
టైటిల్‌లానే ఈ సినిమా శక్తివంతంగా ఉంటుందని, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు. జిలేబీ పాత్రలో బ్రహ్మానందం కనిపించి, నవ్వించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. చరణ్, వినాయక్ ఇద్దరికీ తమన్ స్వరాలందించడం ఇదే ప్రథమం. చిరంజీవి నటించిన 'కొండవీటి దొంగ'లోని 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో...' పాటను ఈ చిత్రం కోసం ఇటీవల రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. దర్శకుడు వినాయక్ చిత్రం గురించి చెబుతూ.. చిరంజీవిగారితో 'ఠాగూర్' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు దర్శకుడు. వినోదం, యాక్షన్... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది అన్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, కెమెరా: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ.


Click it and Unblock the Notifications











