షాక్: చిరు అనుకుంటే...సీన్లోకి అఖిల్ వచ్చాడు!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చేయబోయే 150వ సినిమాకు దర్శకుత్వం వహించేది వివి వినాయకే అంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ ప్రవర్తన కూడా ఈ వార్తలకు బలం చేకూరే విధంగా ఉంటూ వస్తోంది. దీనికి తోడు ‘అల్లుడు శ్రీను' తర్వాత ఏ సినిమా ప్రాజెక్టుకు వినాయక్ సైన్ చేయక పోవడంతో....చిరంజీవి 150వ సినిమా కోసం వెయిటింగులో ఉన్నారనే ప్రచారం జరిగింది.

అయితే వినాయక్ అభిమానులు షాకయ్యేలా ఇపుడు సీన్లోకి అక్కినేని అఖిల్ వచ్చాడు. అఖిల్ తెరంగ్రేటం చేయబోయే సినిమాకు వివి వినాయక్ కమిట్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. వెలిగొండ శ్రీనివాస్ ఇచ్చిన కథ,మాటలుతో ఈ చిత్రం భారీగా రూపొందనుందని అంటున్నారు. వివి వినాయిక్ రీసెంట్ గా అల్లుడు శీను తో నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడుని సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయటంతో నాగార్జున స్వయంగా వెళ్లి వినాయక్‌ను ఒప్పించినట్లు సమాచారం. ఇందులో నిజం ఏదనేది త్వరలో తేలనుంది.
జోరు మీద ఉన్న అఖిల్...
మనం' 100 డేస్ ఫంక్షన్లో అఖల్ మాట్లాడుతూ...నా ఎంట్రీ గురించి అభిమానులకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాను. బ్లాక్ బస్టర్ సినిమాతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. కొడితే హిట్ కొట్టాలనుకుంటున్నాను. కొడితే అలాంటి ఇలాంటి హిట్ కొట్టాలనుకోవడం లేదు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకుంటున్నాను. ‘ఒక లైలా కోసం' సినిమా విడుదలైన హిట్టయిన తర్వాత నా ఎంట్రీ గురించి విజయవాడలో మీ అందరి ముందుకు వస్తాను, అంత వరకు అభిమానులు ఓపిక పట్టాలి అంటూ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











