twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ బద్రీనాధ్ లో ప్రత్యేకతలు ఇవే...వినాయిక్

    By Srikanya
    |

    అల్లు అర్జున్, వి.వి.వినాయక్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం బద్రీనాథ్‌. ప్రస్తుతం కులుమనాలిలో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రత్యేకతలు వినాయిక్ మీడియాకు చెపుతూ.... తక్షశిలకు చెందిన ఘట్టాలు, విజువల్స్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా మెప్పిస్తాయని అన్నాయి. అలాగే ఊహించని విధంగా విభిన్నమైన కథా, కథనాలుంటాయని అన్నారు. అల్లు అర్జున్‌ డాన్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని వినాయక్‌ తెలిపారు.

    ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ కొత్త తరహా గెటప్ లో విచిత్రమైన పాత్రలో కనిపించనున్నాడు. తమన్నా అతనితో ప్రేమలో పడి సొంతం చేసుకునే పాత్రలో చేస్తోంది. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కథని చిన్ని కృష్ణ అందించారు. తమన్నాకీ అల్లు అర్జున్ కీ వచ్చే ప్రేమ సన్నివేసాలు హైలెట్ గా కనిపించనున్నాయి. ఇక కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    కమల్ కన్నన్ (మగధీర ఫేమ్) ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. దశావతారం, రాఘవన్, అపరిచితుడు వంటి భారీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన రవి వర్మన్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

    ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ తర్వాత వివి వినాయిక్..అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే.ఇక ఈ "బద్రీనాధ్" మార్చి 27, 2011న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజు రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X