టాక్ విని చాలా నిరుత్సాహపడ్డాను....వివి వినాయక్
వాస్తవానికి మొదటి రోజు టాక్ విని చాలా నిరుత్సాహపడ్డాను. అయితే బన్నీ (అల్లు అర్జున్) నటించిన అన్ని చిత్రాలకన్నా ఇదే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది అంటున్నారు దర్శకుడు వివి వినాయిక్. ఆయన తాజా చిత్రం బద్రీనాధ్ గురించి మాట్లాడుతూ.....ఈ చిత్రానికి మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత వసూళ్లు పుంజుకున్నాయి. ఈ చిత్రం కోసం బన్నీ చాలా కష్టపడ్డాడు. కథని ఎలివేట్ చేయాలంటే తన పాత్ర అద్భుతంగా ఉండాలన్న తపనతో వియత్నాం వెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. బన్నీ అద్భుతంగా నటించాడు. అలాగే తమన్నా కూడా. ఈ చిత్రానికి భారీ వసూళ్లు రావడానికి కారణం మహిళా ప్రేక్షకులు అన్నారు. అరవింద్‌గారు రాజీపడకుండా ఖర్చు పెట్టారు కాబట్టి ఈ చిత్రం కథకు న్యాయం జరిగింది అన్నారు. అలాగే ఇది రొటీన్ కథ కాదు. తెరకెక్కించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అందుకే చిన్నికృష్ణ చెప్పగానే ఎంతో ఇష్టపడి ఈ చిత్రం చేయాలనుకున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











