మరోసారి 'వినాయకుడు' కాంబినేషన్
''పెద్ద సినిమాలో ఓ పాట, ఫైటూ తీయడానికి కనీసం ఇరవై రోజులు పడుతుంది. అంతే సమయంలో వీళ్లు ఏకంగా సినిమానే తీశారు. ప్రచార చిత్రాలు చూస్తుంటే.. నాణ్యత ఎక్కడా తగ్గలేదని పిస్తోంది''అన్నారు అతిథులు. తొలి సీడీని సి.కల్యాణ్ ఆవిష్కరించి సాగర్‌కి అందజేశారు.
''వినాయకుడు సినిమాలో కృష్ఱుడు, సోనియా ఎంత ఆకట్టుకొన్నారో.. అంతకు రెట్టింపు పేరు తెచ్చుకొంటారు. సరదాగా సాగే ప్రేమ కథ ఇది. మన్మథుడు ఏం చేశాడో తెర మీదే చూడాలి. నవనీత్ చారి అందించిన బాణీలు వినసొంపుగా ఉన్నాయ''ని దర్శకనిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్.ఎల్.కుమార చౌదరి, రాజా రవీంద్ర, పోకూరి బాబూరావు, సంతోష్ శ్రీనివాస్, టి.ప్రసన్నకుమార్, భాషాశ్రీ తదితరులు పాల్గొన్నారు.
. 'అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటారు? అబ్బాయికి ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది?' అనే ఇతివృత్తంతో నిర్మించిన ఈ సినిమాలో మొత్తం మూడు జంటలున్నాయని నిర్మాతలు తెలిపారు. ఇందులో ఇంటర్నెట్ ప్రేమల్ని కూడా చూపించామని, ఆద్యంతం హాస్యభరితంగా సినిమా నడుస్తుందని అన్నారు.
ప్రస్తుతం అమ్మాయిల తీరు మారింది. అందరూ సిక్స్ ప్యాక్ కావాలని కోరుకుంటున్నారు. సిక్స్ ప్యాక్ అంటే 6 కోట్ల స్థిరాస్థి, 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్, కార్ వగైనా..., అలాంటి అమ్మాయికి ఎలాంటి అబ్బాయి దొరికాడు అనే కాన్సెప్టుతో ఈచిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఈ చిత్రంలో ఇంకా కొండవలస, శివన్నారాయణ, అల్లరి సుభాషిణి, మెల్కోటే, స్వప్నిక, నండూరి రాము తదితరులు నటిస్తున్నారు. కెమెరా : ఆరిఫ్ లలానీ, సంగీతం : నవనీత్ చారి, కథ : బెల్లంకొండ సత్యం, ఎస్.ఎ.కె.భాషాశ్రీ, ఎడిటింగ్ : నాగిరెడ్డి, మాటలు-పాటలు : బాషా శ్రీ, కళ : రామ్ చందర్ సింగ్, సహ నిర్మాతలు : బాలాజీ శ్రీను, కొర్రపాటి వెంకటరమణ, కథనం, దర్శకత్వం : సత్యం బెల్లంకొండ.


Click it and Unblock the Notifications












