'వినాయకుడు' దర్శకుడు సాయి కిరణ్ నెక్స్ట్ చిత్రం డిటేల్స్...
'వినాయకుడు', 'విలేజిలో వినాయకుడు' చిత్రాల దర్శకుడు సాయికిరణ్ అడివి త్వరలో మరో చిత్రం చేస్తున్నారు. 'కేరింత' పేరుతో నిర్మించే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారు. ఇందులో కొత్తవారు ప్రధాన పాత్రలు పోషిస్తారు.మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక సాయి కిరణ్ ..విలేజ్ లో వినాయకుడు అనంతరం నాగచైతన్యకు ఓ కథ చెప్పారని సమాచారం.
అయితే ఆ కథ నచ్చినా డేట్స్ ఇప్పుడిప్పుడే దొరికే సిట్యువేషన్ లేకపోవటంతో గ్యాప్ రాకూడని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు కూడా తన బ్యానర్ పై చిన్న చిత్రాలు చేసి ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తన్నారు. ప్రస్తుతం దిల్ రాజు...సిద్దార్ధ, శృతి హాసన్ కాంబినేషన్ లో ఓ మై ప్రెండ్ చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా ఆయన నిర్మించిన మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.
దిల్ రాజు వినాయకుడు విలేజ్ లో వినాయకుడు సాయి కిరణ్ కేరింత dil raju vinayakudu village lo vinayakudu sai kiran kerintha


Click it and Unblock the Notifications