twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వినాయికుడు' వస్తున్నాడు

    By Staff
    |

    Vinayakudu
    శేఖర కమ్ముల శిష్యుడు సాయి కిరణ్ అడవి దర్శకుడుగా పరిచయమవుతూ నిర్మిస్తున్న చిత్రం వినాయుకుడు. ఆ నలుగురు నిర్మించిన ప్రేమ్ మూవీస్ బ్యానర్ పై సరితా పాత్ర ఈ చిత్రాన్ని ప్రొడ్యుస్ చేసారు. రొమాంటిక్ కామిడిగా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అలాగే ఈ చిత్రంలో హ్యాపీడేస్ ఫేమ్ సోనియా,కృష్ణుడు జంటగా కనిపిస్తారు.

    లావుగా ఉన్న వారికి ప్రేమలో పడే అవకాశం లేదా అనే పాయింట్ ని చర్చిస్తూ సాగే ఈ చిత్రం నవంబర్ ఇరవై రెండున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శౌర్యంలో గోపీచంద్ చెల్లిగా కనపడ్డ పూనమ్ కౌర్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనపడుతోంది. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నైజాం,వైజాగా ఏరియాలకు డిస్ట్రిబ్యుషన్ తీసుకున్నారు. సురేష్ డిస్ట్రిబ్యూషన్ వారు మిగతా ఏరియాలలో పంపిణి చేయనున్నారు. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఆర్ కె ఫిల్మ్స్ వారు తీసుకున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X