తగలబెట్టేశారు: 'పద్మావత్' థియేటర్లపై కర్ణిసేన దాడులు, పరిస్థితి చేజారుతోందా?

Recommended Video

'పద్మావత్' థియేటర్లపై కర్ణిసేన దాడులు.. పరిస్థితి చేజారుతోందా ?

న్యాయపరంగా 'పద్మావత్‌' విడుదలను అడ్డుకోలేకపోయినా.. హింసాత్మక ఆందోళనల ద్వారా సినిమాను అడ్డుకోవడానికి కర్ణిసేన ప్రయత్నిస్తోంది. చిత్ర విడుదల వేళ.. గుజరాత్, రాజస్థాన్‌లో కర్ణిసేన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. థియేటర్లు, షాపింగ్ మాల్స్ ను ధ్వంసం చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

థియేటర్లను తగలబెట్టేశారు:

గుజరాత్‌, అహ్మదాబాద్‌లో 'పద్మావత్' సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌పై కర్ణిసేన వర్గాలు దాడులకు దిగాయి. సినిమా విడుదలకు సిద్దమవుతున్న హిమాలయ, అహ్మదాబాద్‌ వన్‌ మాల్స్‌, మరో సినిమా థియేటర్‌ను కర్ణిసేన కార్యకర్తలు తగలబెట్టేశారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో, రోడ్లపై ఉన్న సుమారు 150 వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టడం గమనార్హం.

శ్రుతిమించిన ఆందోళనలు:

ఆందోళనలు శ్రుతిమించుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేయక తప్పలేదు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్రంలో కర్ణిసేన ఆందోళనలపై డీజీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

గుజరాత్ లో హైసెక్యూరిటీ:

కర్ణిసేన దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని భద్రతా బలగాలను మోహరించారు. ప్రధానంగా 'పద్మావత్' ప్రదర్శించబోయే థియేటర్లకు భద్రత పెంచారు. రాష్ట్రంలో ఆందోళనలపై సీఎం విజయ్ రూపానీ కూడా స్పందించారు. అందరూ శాంతి పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 మాస్కులు ధరించి మరీ..:

మాస్కులు ధరించి మరీ..:

ఆందోళనల్లో పాల్గొన్నవారు మాస్కులు ధరించి మరీ దాడులకు పాల్పడటం గమనార్హం. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకే వారు మాస్కులు ధరించి థియేటర్లపై దాడులకు పాల్పడ్డారని చెబుతున్నారు. గుజరాత్ లో చెలరేగిన హింస బీజేపీ పాలిత రాష్ట్రాలకు పాకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో..:

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో..:

గుజరాత్ లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న గంటల్లోనే.. మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లలో కర్ణిసేన కార్యకర్తలు రోడ్డెక్కడం గమనార్హం.కాన్పూర్‌లో ఓ షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశించిన ఆందోళనకారులు, అక్కడి సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు.

 ఉజ్జయినిలో ఒకరి అరెస్ట్:

ఉజ్జయినిలో ఒకరి అరెస్ట్:

సినిమా ప్రదర్శించవద్దని హెచ్చరిస్తూ.. చాలాచోట్ల 'పద్మావత్' పోస్టర్లను కర్ణిసేన చించిపడేసింది. ఇండోర్‌, మొరేనా, గ్వాలియర్ పట్టణాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. ఇక ఉజ్జయినీలోని ఓథియేటర్‌పై దాడికి యత్నించిన వారిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 థియేటర్ యాజమాన్యాల్లో భయాందోళన..:

థియేటర్ యాజమాన్యాల్లో భయాందోళన..:

గురుగ్రామ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ అల్లర్లను అదుపు చేయాడానికి 144 సెక్షన్‌ విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంతవరకు గుంపులుగా తిరగడంపై నిషేదాజ్ఞలు జారీ చేశారు. వరుస దాడుల నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మరోవైపు ఎక్కడ థియేటర్ పై దాడికి పాల్పడుతారేమోనని చాలా థియేటర్లు 'పద్మావత్'ను ప్రదర్శించట్లేదని బోర్డులు కూడా పెట్టడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X