twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ చేయలేని పని సమంత చేయగలిగింది.. హాట్ హాట్ చర్చల్లో జనం

    |

    నందమూరి వారసుడిగా ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ హవా సాగిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. తన తండ్రి ప్రారంభించిన తెలుగు దేశం పార్టీలో యాక్టీవ్ గా ఉంటూ హిందూపురం ఎమ్మెల్యేగా మరోసారి విజయకేతనం ఎగరేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా హీరోయిన్ సమంత చేసిన పని కూడా నందమూరి హీరోలతో కాలేక పోయిందన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఇక విషయంలోకి వస్తే..

    2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం స్థానాల్లో కనీసం పావు శాతం స్థానాలు కూడా దక్కించుకోలేక పోయింది. వెరసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహించని రీతిలో భారీ విక్టరీ సాధించారు. టీడీపీలో గెలిచిన కొన్ని స్థానాల్లో బాలకృష్ణ హిందూపురం కూడా ఒకటి. తన సొంత స్థానంలో బాగానే ఉన్నా ఆయన ప్రచారానికి వెళ్లిన ఇతర స్థానాలు మాత్రం విజయం సాధించలేక పోయాయి. ఈ నేపథ్యంలో సమంత రెకమండ్ చేసిన ఒక స్థానం.. అదీ టీడీపీ స్థానం విజయ పతాకం ఎగురవేయడం ప్రస్తుతం హాట్ చర్చలకు దారితీస్తోంది. సమంత చెప్పిన ఒక్క మాటతో గట్టెక్కిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి అదృష్టం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

    Viral comments on Balakrishna and Samantha

    గుంటూరు జిల్లా రేపల్లె అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా అనగాని సత్యప్రసాద్ అనే వ్యక్తి పోటీ చేశాడు. ఈయన సమంత నిర్వహించే ప్రత్యూష ఫౌండేషన్ లో వైద్య సేవలు అందిస్తున్న ఓ డాక్టర్ కి సోదరుడు. వారి కుటుంబంతో సమంతకు బాగా సాన్నిహిత్యం ఉండటం కారణంగా రేపల్లె నుంచి సత్యప్రసాద్ గెలుపు కోసం సమంత రంగంలోకి దిగింది. సత్య ప్రసాద్ కి ఓటెయ్యండి అని ట్విటర్ ద్వారా కోరడమే కాకుండా అతడి విజయాన్ని కోరుకుంటూ రేపల్లె కూడా వచ్చి ప్రచారం చేసింది. ఇక తీరా ఫలితాలు చూస్తే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన హేమాహేమీలు అంతా ఓడి పోయారు కానీ సత్యప్రసాద్ గెలిచాడు. దీంతో సమంత మాటే రేపల్లెలో టీడీపీ అభ్యర్థి గెలుపుకు కారణంఅంటూ కామెంట్ చేస్తున్నారు. సమంతను ఒప్పించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే ఆ పార్టీ భవితవ్యం బాగుటుందని జోకులు మీద జోకులు పేల్చుతున్నారు నెటిజన్స్.

    Read more about: samantha akkineni tdp
    English summary
    Samantha akkineni supported tdp leader won in repalle assembly constituency in Ap. Now This issue is hot topic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X