For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైరల్ టాపిక్స్ : సమంత వెరైటీ కాఫీ.. నభా గీసిన చిత్రం.. లావణ్య చేసిన కసరత్తులు

  |

  సోషల్ మీడియాలో తారలు సందడి చేశారు. సమంత వెరైటీ కాఫీ చేయగా.. నభా నటేష్ తన లోని టాలెంట్‌ను బయటపెట్టింది. ఇక లావణ్య జిమ్‌లో తెగ కష్టపడింది. నితిన్ యాడ్స్‌ షూట్‌కు సంబంధించిన ఫోటో షూట్ వైరల్ కాగా.. అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ ట్రైలర్ వైరల్ అయింది. ఇలా నేడు సోషల్ మీడియాలో వైరల్ అయిన టాపిక్స్ అన్నీ మీ కోసం..

  యువ హీరో సినిమాలో దగ్గుబాటి రానా స్పెషల్ రోల్..

  యువ హీరో సినిమాలో దగ్గుబాటి రానా స్పెషల్ రోల్..

  దగ్గుబాటి రానా ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త ధనం ఉంటుంది. కేవలం హీరోగానే కాకుండా విభిన్నమైన గెస్ట్ పాత్రలతో కూడా మెప్పిస్తున్న ఈ బాహుబలి విలన్ త్వరలో మెగా హీరో సినిమాలో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ఇక ఆ మెగా హీరో మరెవరో కాదు. ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్న వైష్ణవ్ తేజ్.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఓటీటీలో ఆనంద్ దేవరకొండ రెండవ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్!

  ఓటీటీలో ఆనంద్ దేవరకొండ రెండవ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్!

  యువ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో బాక్సాఫీస్ రౌడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అదే తరహాలో హీరోగా గుర్తింపు పొందాలని విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా చాలానే కష్టపడుతున్నాడు. గత ఏడాది దొరసాని సినిమాతో ప్రేక్షకులకు ముందుకి వచ్చిన ఆనంద్ తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఫైనల్‌గా నా డ్రీమ్ నిజమవుతోంది.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్

  ఫైనల్‌గా నా డ్రీమ్ నిజమవుతోంది.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్

  రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు ఎలాంటి స్టార్ట్స్ అయినా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అంటున్నారు. వైజయంతి ప్రొడక్షన్ లో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ లో ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తున్న ప్రభాస్ చాలా రోజుల తరువాత ఆ ప్రాజెక్ట్ పై స్పందించాడు. మొత్తానికి నా డ్రీమ్ నెరవేరబోతోందని ప్రభాస్ చెప్పిన విధానం నెటిజన్లను ఆమితంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ అమితాబ్ బచ్చన్ ని ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నేటి కష్టమే రేపటి ప్రతిఫలం.. లావణ్య త్రిపాఠి వర్కౌట్లు వైరల్

  నేటి కష్టమే రేపటి ప్రతిఫలం.. లావణ్య త్రిపాఠి వర్కౌట్లు వైరల్

  ప్రస్తుతం హీరోయిన్లందరూ జిమ్ బాట పట్టారు. ఇన్నాళ్లూ లాక్ డౌన్ వల్ల ఇంట్లో ఉండటం, డైట్ ఫాలో అవ్వకపోవడం, ఇష్టమొచ్చినట్టుగా ఫుడ్ తీసుకోవడంతో ఇప్పుడు అందరూ కసరత్తులు చేస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలో షూటింగ్‌లు ప్రారంభం అవుతుండటంతో అందరూ మళ్లీ జీరో సైజ్‌లోకి మారేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాశీ ఖన్నా, రష్మిక మందాన్న, లావణ్య త్రిపాఠి వంటి హీరోయిన్లందరూ జిమ్ బాట పట్టారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నిశ్శబ్దం సినిమా అనుష్మ చేయాల్సింది కాదట.. ఆ రైటర్ రావడంతో ప్లాన్ రివర్స్?

  నిశ్శబ్దం సినిమా అనుష్మ చేయాల్సింది కాదట.. ఆ రైటర్ రావడంతో ప్లాన్ రివర్స్?

  బాహుబలి, భాగమతి సినిమాల అనంతరం చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి చాలా రోజుల తరువాత విభిన్నమైన టాక్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన నిశ్శబ్దం సినిమా ఊహించని విధంగా ఓ వర్గం ఆడియెన్స్ నుంచి నెగిటివ్ టాక్ ను అందుకుంది. అనుష్క గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదనే టాక్ కూడా వచ్చింది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ సినిమాను మొదట అనుష్క చేయాల్సింది కాదట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  థియేటర్స్ లో సుశాంత్ చివరి సినిమా ..

  థియేటర్స్ లో సుశాంత్ చివరి సినిమా ..

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బేచారా ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దిల్ బేచారా ట్రైలర్ ప్రపంచంలో అత్యధిక లైక్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.ఆతరవాత విడుదలైన సినిమా కూడా అదే రేంజ్ లో విజయం సాధించింది. రికార్డుల మోతమోగించింది. హాలీవుడ్ చిత్రాలకే సాధ్యమైన రికార్డును దిల్ బేచారా అవలీలగా అందుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలో ఈ చిత్రం ఏకంగా 95 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుందని హాట్ స్టార్ అధికారికంగా పేర్కొంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  'లక్ష్మీబాంబ్' ట్రైలర్.. ఆకట్టుకున్న అక్షయ్

  'లక్ష్మీబాంబ్' ట్రైలర్.. ఆకట్టుకున్న అక్షయ్

  ఏడాదికి ఐదు నుంచి ఏడు సినిమాలు చేసే ఏకైక హీరో అక్షయ్ కుమార్. చిన్న మీడియం బడ్జెట్ సినిమాలు ఎంచుకుంటూ మంచి విజయం సాగిస్తుంటాడు. ఇదే అక్షయ్ టాప్ హీరోగా నిలబడటానికి కారణం అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటె, సౌత్ లో మంచి విజయం సాధించిన 'కాంచన' సినిమాను బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  లైఫ్ పాట్నర్ ను వెతుకోవడానికి చాలా అప్షన్స్ ఉన్నాయి : యామీ గౌతమ్

  లైఫ్ పాట్నర్ ను వెతుకోవడానికి చాలా అప్షన్స్ ఉన్నాయి : యామీ గౌతమ్

  రవిబాబు 'నువ్విలా', ఆ తర్వాత నితిన్ కొరియర్‌బాయ్ కళ్యాణ్ ,'గౌరవం' లాంటీ సినిమాలతో తెలుగు వారిని అలరించిన యామీ గౌతమ్... ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అలరించకపోవడంతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళ చిత్రాలు కూడా చేసింది. అయినప్పటికీ ఆమెకు దక్షిణాదిలో నిరాశే ఎదురైంది. అయితే బాలీవుడ్‌ నుంచి మాత్రం ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. గ్లామర్‌పరంగానే కాకుండా మంచి నటిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది. త్వరలో 'గిన్నీ వెడ్స్ సన్నీ' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  యాడ్ కోసం అదిరిపోయే లుక్.. నితిన్ పిక్స్ వైరల్

  యాడ్ కోసం అదిరిపోయే లుక్.. నితిన్ పిక్స్ వైరల్

  టాలీవుడ్ హీరో నితిన్‌కు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చింది. ఎన్నో రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురుచూసిన నితిన్‌కు భీష్మ రూపంలో సూపర్ హిట్ దక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లాక్ డౌన్ వల్ల ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో గడపడం ఇలా నితిన్‌కు ఈ ఏడాది అంతా బాగానే కలిసి వచ్చింది. ఇలా లాక్ డౌన్ ఎత్తేశారో లేదో మళ్లీ షూటింగ్‌లంటూ రంగంలోకి దిగేశాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వెగన్ ఫిల్టర్ కాఫీతో అదరగొట్టిన సమంత.. ఉపాసన కోసం స్పెషల్‌గా

  వెగన్ ఫిల్టర్ కాఫీతో అదరగొట్టిన సమంత.. ఉపాసన కోసం స్పెషల్‌గా

  ఆరోగ్యం, మానసిక పరిపుష్టి కోసం మెగా కోడలు ఉపాసన కొణిదెల ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. ఆరోగ్య చిట్కాలు అందించేందుకు Ur Life అనే మ్యాగజైన్‌ను నడుపుతున్నారు. ఈ మ్యాగజైన్‌కు గెస్ట్ ఎడిటర్‌గా సమంత అక్కినేని వ్యవహరిస్తున్నారు. హెల్త్, ఫిట్‌నెస్‌ కోసం పరితపించే సమంత ఎడిటర్‌గా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ మ్యాగజైన్, యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రత్యేమైన రెసిపీని సమంత చేయడం విశేషంగా మారింది. ఈ మ్యాగజైన్ కోసం స్పైస్ అప్ యవర్ లైఫ్ విత్ సామ్ అనే శీర్షికన మంచి కాఫీని తయారు చేసి చూపించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నభా టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఆర్టిస్ట్‌లో ఎంతో ఆర్ట్ దాగి ఉంది!

  నభా టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఆర్టిస్ట్‌లో ఎంతో ఆర్ట్ దాగి ఉంది!

  నన్ను దోచుకుందువటే సినిమాతోనే నభా నటేష్ టాలెంట్ ఏంటో అందరికీ అర్థమైంది. ఆపై ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ క్యారెక్టర్‌ను పోషించి ఇస్మార్ట్ పోరి అని ట్యాగ్‌ను తెచ్చుకుంది. ఇక నభాకు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. మరీ అంతగా ఎక్స్‌పోజింగ్ చేయకుండానే మోడ్రన్ డ్రెస్సులు, చీరలు కట్టి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ మధ్యే సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Rana Daggubati-Miheeka Bajaj’s Wedding Not Postponed
  మద్రాసి గ్యాంగ్‌కు మంచు మనోజ్ సపోర్ట్.. ఒక్కడు మిగిలాడు సంస్థలో..

  మద్రాసి గ్యాంగ్‌కు మంచు మనోజ్ సపోర్ట్.. ఒక్కడు మిగిలాడు సంస్థలో..

  పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ పతాకంపై ఎస్.ఎన్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం మద్రాసి గ్యాంగ్. తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఒక్కడు మిగిలాడు ఫేమ్ అజయ్ ఆండ్రూస్ నూతంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X