వైరల్ న్యూస్: సమంత కారణంగా చైతూ ఇమేజ్ డామేజ్ అవుతోందా? ఏం మాయ చేస్తోంది

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ అండ్ క్రేజీ జోడీ ఎవరంటే.. టక్కున గుర్తొచ్చేది నాగచైతన్య, సమంతానే. ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట పక్షులు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని మోస్ట్ పాపులర్ భార్యాభర్తలుగా కొనసాగుతున్నారు. ఏ మాయ చేశావే సినిమా తర్వాత పుట్టిన వీరి ప్రేమ కాస్త 2017 లో పెళ్లిపీటలెక్కి ఇద్దరినీ ఒక్కటి చేసింది. పెళ్లి నాటికే ఇద్దరూ స్టార్ హీరో హీరోయిన్లుగా పేరు తెచ్చుకోవడంతో అప్పట్లో వీరి పెళ్లిపై జనాల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. అయితే అదే ఆసక్తిని కొనసాగిస్తూ నేటికీ కంటిన్యూ అవుతున్నారు చైతూ సామ్ జోడీ. కాగా ఈ విషయంలో తాజాగా ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో చూద్దాం..

ఈ మధ్యనే మజిలీ సినిమాతో..

ఈ మధ్యనే మజిలీ సినిమాతో..

పెళ్లి తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీ బిజీగా ఉన్న ఈ యంగ్ జోడీ మొదటిసారి మజిలీ సినిమాతో తెర పంచుకుంది. శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా ఎమోషన్ పండించారు. దీంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించి ఈ రియల్ జోడీకి రీల్ జోడీగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత వీరిని తమ సినిమాలో అంటే తమ సినిమాలో నటించాలని దర్శకనిర్మాతలు వెంట బడుతున్నారట.

 కొత్త తలనొప్పి

కొత్త తలనొప్పి

సాధారణంగా ఓ సినిమా హిట్ అయ్యిందంటే అందులో హీరో యాక్టింగ్ బాగుందా లేక హీరోయిన్ యాక్టింగ్ బాగుందా అనే టాక్ రావడం కామన్. అయితే మజిలీ విషయంలో ఇదే చైతూ సామ్ జోడీకి పెద్ద తలనొప్పిగా మారింది. భార్యాభర్తలు కావడంతో ఇద్దరిలో ఎవరు బెటర్ అనే బెట్టు పెట్టుకుంటున్నారు కొందరు. ఎంతో అన్యుణ్యంగా ఉన్న ఈ జంటకు ఇదో సమస్యగా మారిందని తెలుస్తోంది.

స్టాఫ్‌తో సమంత అటాచ్‌మెంట్

స్టాఫ్‌తో సమంత అటాచ్‌మెంట్

స‌మంత‌కు, నాగ‌చైత‌న్య‌లకు వేరు వేరుగా స్టాఫ్ ఉన్నారు. డ్రెస్సింగ్ మొదలుకొని హెయిర్ స్టైలింగ్‌, మేక‌ప్ ఇలా అన్నింటినీ వారే దగ్గరుండి చూసుకుంటారు. అయితే సమంతకు తన స్టాఫ్ అంటే ప్రాణమట. వాళ్ళతో బాగా అటాచ్‌మెంట్‌లో ఉంటుందట సామ్. ఈ నేపథ్యంలో స్టాఫ్ కి కూడా సమంత అంటే చాలా ఇష్టముండటం సహజమే. ఇదే ఇప్పుడు నాగచైతన్యను ఇబ్బంది పెట్టింది.

సమంత స్టాఫ్‌‌ని డైరెక్ట్‌గా అడిగిన చైతూ

సమంత స్టాఫ్‌‌ని డైరెక్ట్‌గా అడిగిన చైతూ

మ‌జిలీ సినిమాలో నాగ చైతన్య, సమంతాల్లో ఎవరు బాగా నటించారు? అనే అనే టాపిక్ స‌మంత‌, చైతూ స్టాఫ్ మ‌ధ్య న‌డిచింద‌ట‌. రెండు గ్రూపుల మ‌ధ్య వాదోప‌వాదాలు కూడా జరిగి చివరకు అది చైతూ వరకు వెళ్లిందట. దీంతో నేను బాగా చేశానా? స‌మంత బాగా చేసిందా? అని డైరెక్టుగా సమంత స్టాఫ్‌ని చైతూ అడిగేశాడట. దీనిపై వారు చైతూకి దిమ్మతిరిగే సమాధానం చెప్పారని తెలుస్తోంది.

చైతూ ఫైర్

చైతూ ఫైర్

మజిలీ స‌మంత మేడ‌మే బాగా చేసింది అని వారు చెప్పడంతో చైతూ కాస్త హార్ట్ అయ్యాడట. ఆ వెంటనే ఆయన సమంత స్టాఫ్ పై కొంచెం సీరియస్ కూడా అయ్యారని తెలుస్తోంది. అప్పుడు రంగంలోకి దిగిన సామ్.. పరిస్థితిని చల్లబర్చిందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X