twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేటీఆర్‌ను కలిసిన జూ ఎన్టీఆర్.... వైరల్ అవుతున్న ఫోటో, విక్టరీ సెలబ్రేషన్లో?

    |

    తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయదుందుభి మ్రోగించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవడం చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో కేటీఆర్ క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటేన్ చేస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్స్ విషెస్ తెలియజేశారు. ఇపుడు ఆ లిస్టులో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కూడా చేరినట్లు ప్రచారం మొదలైంది.

    ఇద్దరూ కలవడం ఇదే తొలిసారి

    ఇద్దరూ కలవడం ఇదే తొలిసారి

    గతంలో కేటీఆర్... మహేష్ బాబు, రామ్ చరణ్‌లను కలిశారు. అయితే ఎన్టీఆర్‌ను ఆయన కలవడం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలో ఎన్టీఆర్, కేటీఆర్, ఇతర స్నేహితులు ఉన్నారు.

    ప్రచారానికి దూరంగా ఎన్టీఆర్

    ప్రచారానికి దూరంగా ఎన్టీఆర్

    తెలంగాణ ఎన్నికల్లో జూ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తారని వార్తలు వెలువడ్డాయి. తమ సోదరి కూకట్‌పల్లి నుంచి బరిలో దిగడంతో వారు తప్పకుండా ఎలక్షన్ కాంపెయిన్లో పాల్గొంటారని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరుగలేదు.

     హరికృష్ణ మరణం తర్వాత కేటీఆర్‌తో అనుబంధం

    హరికృష్ణ మరణం తర్వాత కేటీఆర్‌తో అనుబంధం

    హరికృష్ణ మరణం తర్వాత కేటీఆర్‌తో ఎన్టీఆర్ అనుబంధం పెరిగినట్లు తెలుస్తోంది. హరికృష్ణ మరణించిపుడు కేసీఆర్, కేటీఆర్ వారి నివాసానికి వచ్చి హరికృష్ణకు నివాళులు అర్పించడంతో పాటు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగేలా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

    జూ ఎన్టీఆర్

    జూ ఎన్టీఆర్

    ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

    English summary
    Tollywood star NTR with TRS leader KTR goes viral on social media and it is being speculated that the actor attended the celebration of TRS victory in Telangana assembly elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X