షాకింగ్.. ప్రియాప్రకాష్ గదిలో విజయ్ దేవరకొండ.. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ!
కన్నుగీటి కుర్రకారుకు కిక్కిచ్చిన చిన్నది ప్రియాప్రకాష్ వారియర్. కేవలం ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే యమ క్రేజ్ కొట్టేసిన ఈ చిన్నది ఇటీవలే 'లవర్స్ డే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డీలా పడింది. దీంతో ఎలాగైనా తిరిగి క్రేజ్ పట్టేయాలని భావించిందో ఏమో! ఏకంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పక్కన చేరింది. పైగా ఆయనతో దిగిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్ తో అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ప్రియా పెట్టిన ఆ కామెంట్ ఏంటి? వీరిద్దరూ ఎక్కడ కలిశారు? వివరాల్లోకి పోతే..

ప్రియాప్రకాష్ గదిలో విజయ్ దేవరకొండ
తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ గదిలో దిగిన పిక్ షేర్ చేసింది ప్రియాప్రకాష్ వారియర్. ఇద్దరూ పక్కపక్కనే నిలబడి కెమెరాకు పోజిచ్చారు. ఈ పిక్ డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ సమయంలో దిగిందని తెలుస్తోంది. ఇద్దరూ క్రేజీ బ్యాచిలర్స్, పైగా ఈ మధ్య కాలంలో క్రేజ్ ఉన్న స్టార్స్ కావడంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వెంటనే వైరల్‌గా మారింది.
నువ్వంటే నాకు చాలా ఇష్టం
ఇక ప్రియా షేర్ చేసిన ఈ పిక్ పై ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం' అంటూ అచ్చ తెలుగులో ట్యాగ్ చేయడం సెన్సేషన్ గా మారింది. ఈ ట్యాగ్ లైన్ చూసి నెటిజన్లు డిఫెరెంట్‌గా స్పందిస్తున్నారు. ''రౌడీ బేబీస్ అంటే ఇలాగే ఉంటారు.. ఏంటి? మా వాడిపై పడ్డాయి నీ కళ్ళు'' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికైతే ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.

ప్రియాప్రకాష్ వారియర్ జర్నీ
ప్రియాప్రకాష్ వారియర్ ప్రస్తుతం నితిన్ సరసన ‘రంగ్‌దే' సినిమాలో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. మరోవైపు ప్రియా వారియర్ నటించిన బాలీవుడ్ సినిమా ‘శ్రీదేవి బంగ్లా' విడుదలకు సిద్ధమవుతోంది.

విజయ్ దేవరకొండకు బ్రేక్
ఇక టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ జోష్‌కి ఇటీవలే 'డియర్ కామ్రేడ్' రూపంలో బ్రేక్ పడింది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలు నడుమ విడుదలై ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











