వైరల్ పిక్: ఆఫ్రికా అడవుల్లో చిరుతను షూట్ చేసిన రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఆఫ్రికాలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. టాంజానియాలోని సెరంగేటి నేషనల్ పార్కులో పర్యటిస్తున్నారు. మెగా అభిమానులు చిరుత అని ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ఇక్కడ రియల్ చిరుతలను కెమెరాతో షూట్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ 'RRR' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌తో పాటు ఎన్టీఆర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలయి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో తాను పాల్గొనడానికి మరింత సమయం ఉండటంతో భార్యతో కలిసి ఆఫ్రికాలో హాలిడే ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు.

ఆ కోరిక ఇప్పటికి తీరింది
రామ్ చరణ్ గతంలో పలు యూరోపియన్, మిడిల్ ఈస్ట్ దేశాలు సందర్శించారు. అయితే ఆఫ్రికాకు ఎప్పుడూ రాలేదు. ఎప్పటి నుంచో చరణ్ మనసులో ఉన్న ఆ కోరిక ఇప్పుడు తీరింది. ఈ హాలిడేకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

చిరుతను షూట్ చేసిన చరణ్
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్ వన్య ప్రాణులకు ప్రసిద్ధి. వాటికి అతిదగ్గరగా సంచరిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని అస్వాదించడం ఒక గొప్ప అనుభూతిగా చెబుతుంటారు. చిరుత పులికి అతి దగ్గరగా వెళ్లి తన కెమెరాలో చరణ్ షూట్ చేస్తున్న దృశ్యాలు ఈ ఫోటోలో చూడొచ్చు.
మురిసిపోయిన ఉపాసన
ఎప్పుడూ తన వ్యాపార వ్యవహారాలతో బిజీగా ఉండే ఉపాసనకు కూడా ఖాళీ సమయం దొరకడంతో తాను ముద్దుగా పిలుచుకునే మిస్టర్ సితో కలిసి ఈ హాలిడే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చరణ్ చిరుతలను కెమెరాతో షూట్ చేస్తుంటే... అతడిని సాహసాన్ని తన కెమెరాలో బంధిస్తూ మురిసిపోయింది ఉపాసన.

వెడ్డింగ్ యానివర్శరీ స్పెషల్ టూర్
సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం జూన్ 14న చరణ్, ఉపాసన వివాహం జరిగింది. RRR షూటింగులో జాయిన్ అయితే వెకేషన్ ఎంజాయ్ చేయడానికి సమయం ఉండదు కాబట్టి ముందుగానే చరణ్ ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తమ పెళ్లి రోజు వరకు ఈ జంట విదేశీ వెకేషన్లో ఎంజాయ్ చేస్తారని టాక్.


Click it and Unblock the Notifications











