ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
Recommended Video
టాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంజన మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఎదో ఒక ఘటనతో వార్తల్లోకెక్కే ఈమె ఈ సారి స్వయంగా తనకు తానే బుక్కయింది. ఎదో సరదాగా తీసుకున్న వీడియో ఆమెను ఇరకాటంలో పడేసింది. చివరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

రూల్స్ అంటే రూల్సే.. అది ఎవ్వరికైనా!
భారత రాజ్యాంగం ప్రకారం ఏ రూల్ అయినా సిటిజన్స్ అందరికీ వర్తిస్తుంది. సెలబ్రిటీ, ఉన్నతమైన వ్యక్తి అనే తేడా ఏ మాత్రం ఉండదు. తప్పు చేస్తే శిక్ష, దానికి పరిణామాలు తప్పవు. ఆ కోణం లోనే బెంగళూరు పోలీసులు సినీ నటి సంజనకు నోటీసులు ఇచ్చేశారు.

మాజెస్టిక్ రోడ్‌లో సెల్ఫీ వీడియో..
సంజన తన కారు డుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. బెంగళూరులోని మాజెస్టిక్ రోడ్‌లో ఆమె చేసిన ఈ పనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చూసేందుకు వెళ్లే సమయంలో సంజన తన కారు డ్రైవ్ చేస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది. దాన్ని సోషల్ మీడియాలో పెట్టింది సంజన.

పోలీసులకు చిక్కిన వీడియో.. దీంతో!
సంజన పోస్ట్ చేసిన ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం నేరం. మొదటిసారి ఇలా చేస్తే 1000 ఫైన్ వేస్తారు. రెండోసారి కూడా ఇలాగే మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే ఛాన్సుంది. అలాంటిది సంజన ఇలా డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు.
గతంలో చాలాసార్లు ఇలాగే..
గతంలో ఇలాగే చాలాసార్లు పోలీస్ కేసుల్లో ఎంటర్ అయింది సంజన. ఇటీవలే బెంగళూరు నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ (పబ్)లో తాగిన మైకంలో నిర్మాత వందన జైన్ పై సంజన దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే దీనిపై తన వివరణ కూడా ఇచ్చింది సంజన. మళ్ళీ ఇప్పుడు ఇలా పోలీసులకు చిక్కింది సంజన.


Click it and Unblock the Notifications











